YS Jagan: జగన్‌కు చంద్రబాబు, నాగబాబు బర్త్‌ డే విషెస్..

శనివారం మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సీఎం జగన్, జనసేన నేత నాగబాబు ఎక్స్‌లో ట్వీట్లు చేశారు. అల్లుఅర్జున్ అభిమానులు సైతం ఆయనకు ఫ్లెక్సీలు కట్టారు.

New Update
Birthday2

శనివారం మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. జనసేన నేత నాగబాబు ఎక్స్‌లో జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. '' మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల MLA జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరిలాగే పదికాలాల పాటు సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని'' రాసుకొచ్చారు. సీఎం చంద్రబాబు కూడా జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 

Also Read :  అల్లు అర్జున్ ఎఫెక్ట్. రాంచరణ్ కు రేవంత్ సర్కార్ ఊహించని షాక్!

Chandrababu - Nagababu Wishes To YS Jagan Birthday

Also Read: మళ్లీ అధికారంలోకి వస్తాం.. మీ అంతు చూస్తాం: రోజా ఉగ్రరూపం

మరోవైపు జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏపీలో అల్లు అర్జున్‌ అభిమానాలు ఏర్పాటు చేసిన ఫ్లేక్సీల అంశం చర్చనీయాంశమవుతోంది. '' రాజు బలవంతుడైనప్పుడే శత్రువులందరూ ఏకమవుతారనే కొటేషన్‌ను బ్యానర్‌లో పెట్టారు. అందులో జగన్‌తో పాటు అల్లు అర్జున్ ఫొటో కూడా ఉంది. నంద్యాలలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిషోర్ రెడ్డి ప్రచారానికి అల్లుఅర్జున్ వచ్చినప్పటి నుంచి.. వైసీపీ ఆయనకి మద్దతిస్తూ వస్తోంది. అంతేకాదు అల్లు అర్జున్‌కు బెయిల్‌ ఇప్పించడంలో వైసీపీ ఎంపీ, లాయర్ నిరంజన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే అల్లుఅర్జున్ అభిమానులు జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లేక్సీలు ఏర్పాటు చేశారు.

Also Read :  కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది 17 మంది

తమ అధినేత జగన్ జన్మదిన వేడుకలను జరుపుకోకుండా అడ్డుకుంటున్నారని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా ఆరోపించారు. RTV తో మాట్లాడిన ఆమె.. ఎక్కడా ఫ్లెక్సీలు పెట్టకూడదు, ఎక్కడా కేక్‌లు కట్ చేయకూడదంటూ కొత్త రూల్స్ తెస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలో ఉన్న సమయంలో ఇలా ఏ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టలేదన్నారు.  

Also Read :  మళ్లీ అధికారంలోకి వస్తాం.. మీ అంతు చూస్తాం: రోజా ఉగ్రరూపం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు