తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందని పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజు ఫైర్ అయ్యారు. తమ అధినేత జగన్ జన్మదిన వేడుకలను జరుపుకోకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. RTV తో రోజా మాట్లాడుతూ.. ఎక్కడా ఫ్లెక్సీలు పెట్టకూడదు.. ఎక్కడా కేక్ లు కట్ చేయకూడదంటూ కొత్త రూల్స్ తెస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలో ఉన్న సమయంలో ఇలా ఏ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టలేదన్నారు.
ఇప్పుడు ఫ్లెక్సీలను తొలగిస్తూ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వానికి జగన్ కటౌట్ ను చూసినా భయం అవుతోందని సెటైర్లు వేశారు. జగన్ ఉన్న సమయంలో ప్రజల పాలన నడిచిందన్నారు. ప్రతీ హామీని అమలు చేశామన్నారు. ఆరు నెలలుగా కూటమి ప్రభుత్వం అందరినీ భయప్రాంతులకు గురి చేస్తోందన్నారు. వైసీపీ నాయకులను హింసించడం, ఆస్తులను ధ్వసం చేస్తున్నారన్నారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తామని రోజా ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు విటన్నింటికీ వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కూటమి నేతలను హెచ్చరించారు.