Andhra Pradesh: ఏపీలో కొత్తగా మూడు జిల్లాలు.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మూడు జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబు వీటికి ఆమోదం తెలిపారు. కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.

New Update
CM Chadnrababu

CM Chadnrababu

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మూడు జిల్లాలు(3 New Districts In AP) ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబు(cm chandrababu) వీటికి ఆమోదం తెలిపారు. కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రుల కమిటీ ఇచ్చిన రిపోర్టుపై రెండో రోజు సమీక్ష జరిపిన చంద్రబాబు..మరికొన్ని మార్పులు చేర్పులు చేసేందుకు ఆమోదం తెలిపారు. అంతేకాదు కొత్తగా అయిదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.  

Also Read: అయ్యప్ప దీక్షలో డ్యూటీ చేయకండి.. పోలీసు శాఖ సంచలన ఆదేశం

Chandrababu Approves Formation Of 3 New Districts In AP

అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, నంద్యాల జిల్లాలో బనగానపల్లె, సత్యసాయి జిల్లాలో మడకశిర అలాగే కొత్తగా ఏర్పాటు కానున్న మదనపల్లె జిల్లాలో పీలేరు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అలాగే కర్నూలు జిల్లాలో అదోని మండలాన్ని విభజించనున్నారు. ఇందులో కొత్త మండలంగా పెద్దహరివనాన్ని ఏర్పాటు చేయనున్నారు. అయితే ఏపీకి కొత్తగా మూడు జిల్లాలు రానున్న నేపథ్యంలో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 29కి చేరనుంది. 

Also Read: సంక్రాంతికి ఊరెళ్లుతున్నారా? బస్సులు, రైల్లు ఫుల్‌ రిజర్వేషన్‌..టికెట్‌ ధర ఎంతో తెలుసా?

Advertisment
తాజా కథనాలు