చాగంటి కోటేశ్వరరావు ఒక ప్రముఖ ఆధ్మాత్మిక ప్రవచనకర్త. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఈయన తన ప్రవచనాలతో ఎంతో మందిని మంత్రమగ్దులను చేస్తారు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు ఆయన ప్రవచనాలను ఎంతో ఇష్టపడతారు. యూత్ ఎలాంటి డైరెక్షన్‌లో వెళ్లకూడదు.. ఏ పని చేస్తే మేలు జరుగుతుంది.
ఇది కూడా చూడండి: సమగ్ర సర్వేపై సర్కార్ అదిరిపోయే శుభవార్త.. ఎక్కడ ఉంటే అక్కడే!
తల్లి దండ్రులు తమ పిల్లలకు ఎలాంటి బుద్దులు నేర్పించాలి. చదువుకునే స్టూడెంట్లు చదువుపై ఎలా ఫోకస్ చేయాలి సహా ఇతర ఎన్నో వాటిపై చెప్తుంటారు. వాటిని వీక్షించి పరవశించిపోయేవారెందరో ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలకు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి ఆధ్మాత్మిక పవచనకర్తకు ఏపీ ప్రభుత్వం కీలకమైన పదవి కట్టబెట్టింది.
ఇది కూడా చూడండి: మోదీకి రేవంత్ వార్నింగ్.. మహారాష్ట్ర ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు!
చాగంటి కోటేశ్వరరావు పదవి తీసుకుంటారా?
కూటమి ప్రభుత్వం తాజాగా నామినేటెడ్ పదవుల రెండో జాబితా రిలీజ్ చేసింది. దాదాపు 59 మందితో కూడిన ఈ జాబితాలో ఏపీ రాష్ట్ర నైతిక విలువల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావుని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చాలా మంది చాగంటి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ మరికొందరిలో మాత్రం నిరాశ కనిపిస్తోంది. ఏపీ రాష్ట్ర నైతిక విలువల సలహాదారు పదవిని ఆయన తీసుకుంటారా? లేదా అనేది అందరిలోనూ క్వచ్చన్ మార్క్.
ఇది కూడా చూడండి: రోడ్డు మీద ఉమ్మివేస్తున్నారా జాగ్రత్తా.. వారి కంటపడితే ఖతమే!
ఎందుకంటే 2016లో చంద్రబాబు హయాంలో కేబినెట్ హూదాతో చాగంటిని ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియమించారు.. కానీ చాగంటి కోటేశ్వరరావు ఆ పదవిని తీసుకోలేదు. ఆ తర్వాత 2023 లో అప్పటి సీఎం జగన్.. ఆయన్ని టీటీడీ ధార్మిక సలహాదారు పదవిలో నియమించారు. అప్పుడు కూడా చాగంటి ఆ పదవిని నిరాకరించారు. దీంతో ఇప్పుడు ప్రకటించిన పోస్ట్‌ని చాగంటి చేపడతారా? లేదా అనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇది కూడా చూడండి: ఉదయాన్నే గ్రీన్ టీ తాగేటప్పుడు ఈ మిస్టేక్స్ చేస్తున్నారా?