Pawan Vs Stalin: పవన్ Vs స్టాలిన్.. దక్షిణాదిలో బీజేపీ బిగ్ స్కెచ్!

పవన్ కల్యాణ్ ను దక్షిణాదిలో బీజేపీ ఐకాన్ గా మార్చాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. తమిళనాడులోనూ స్టాలిన్ కు ధీటైన అస్త్రంగా పవన్ ను ఉపయోగిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు అమిత్ షాతో పవన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

author-image
By srinivas
New Update
d tbh

Pawan Vs Stalin: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధ్య సనాతన ధర్మం వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సనాతన ధర్మాన్ని పెకిలించి వేయాలనే ఉదయనిధి వ్యాఖ్యలపై ఇటీవల పవన్ కల్యాణ్‌ కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. సనాతన ధర్మంలోని కొన్ని పద్ధతులు కరోనా వైరస్, మలేరియా జబ్బు లాంటివని, ఆ వైరస్‌లను నిర్మూలించాలని ఉదయనిధి అన్నారు. అయితే దీనిపై తనదైన స్టైల్ లో రియాక్ట్ అయిన పవన్.. సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, సనాతన ధర్మాన్ని టచ్ చేస్తే నామరూపాల్లేకుండా పోతారంటూ సంచలన కామెంట్స్ చేయడం దక్షిణాదిలో పొలిటికల్ వార్ కు తెరతీసింది.

బీజేపీ సౌత్ ఫేస్ గా పవన్ కల్యాణ్‌..  


దక్షిణాదిలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ.. పొత్తు రాజకీయాలతో నెమ్మదిగా పుంజుకుంటోంది. ఇందులో భాగంగానే ఏపీలో టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని అధికారం పంచుకుంటోంది. అయితే తమిళనాడు మాత్రం బీజేపీకి కొరకరాని కొయ్యగా మారడంతో.. ఎలాగైనా అక్కడ పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలోనే ఉదయనిధి వ్యాఖ్యలు బీజేపీకి మరింత బలం చేకూరినట్లైంది. సనాత ధర్మాన్ని అడ్దంపెట్టుకుని తమిళనాడులోని హిందువులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదుపుతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సౌత్ లో బీజేపీ ఫేస్ ఉండాలని, అందుకు భారీ పాపులారిటీ ఉన్న వ్యక్తి కోసం వేసిచూస్తున్న బీజేపీ.. పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసిందనే కామెంట్స్ వినపడుతున్నాయి. అధికారంలోకి రాకముందు విభిన్న మతాల గౌరవిస్తానని, చెగువేరా ఆదర్శమంటూ ప్రచారం చేసిన పవన్.. ఒక్కసారిగా సనాతన ధర్మం గురించి వాదన చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సౌత్ ప్రజలను నెమ్మదిగా మత రాజకీయాల వైపు మరలించడంలో బీజేపీ విజయం సాధిస్తోందని, ఇందుకు సరైన ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ భావించి దగ్గరకు తీసుకుంటున్నట్లు చర్చ నడుస్తోంది. 

బీజేపీలో జనసేన విలీనం.. 


ఇక 2024 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుని భారీ మోజారిటీ సాధించిన జనసేనాని.. నెమ్మదిగా బీజేపీకి దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తిరుపతి లడ్డూ విషయంలోనూ దూకుడుగా వ్యవహరించిన పవన్.. సనాతన ధర్మం కోసం ప్రాణాలివ్వడానికైనా సిద్ధంగా ఉన్నానంటూ మోదీ మెప్పుపొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ఇటీవల సనాతన ధర్మాన్ని కాపాడేందుకు జనసేనలో ‘నరసింహ వారాహి బ్రిగేడ్’ వింగ్‌ను ప్రారంభిస్తున్నట్టు జనసేనాని ప్రకటించడం విశేషం. కాగా సనాతన ధర్మాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు, సనాతన ధర్మాన్ని అగౌరవపరిచే వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పవన్ హెచ్చరించడం ఆసక్తికరంగా మారింది. దీంతో బీజేపీలో జనసేనాను విలీనం చేసే లక్షణాలు కనిపిస్తున్నాయని, ఇదే నిజమైతే అటు బీజేపీ లక్ష్యం కూడా నెరవేరుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

సాధువులు & సిద్ధుల భూమి..
తమిళనాడులో ఇటీవల సినీ నటుడు విజయ్ దళపతి 'టీవీకే' పార్టీ ఆవిర్భావ సభలో చేసిన వ్యాఖ్యలపై పవన్ పాజిటివ్ గా స్పందిస్తూ విజయ్ కి కంగ్రాట్స్, అభినందనలు తెలిపారు. 'సాధువులు & సిద్ధుల భూమి అయిన తమిళనాడులో రాజకీయ యాత్రను ప్రారంభించినందుకు తిరుకి నటుడు విజయ్ కి నా హృదయపూర్వక అభినందనలు' అని పోస్ట్ పెట్టారు పవన్. అయితే స్టాలిన్ తో వివాదం నేపథ్యంలో విజయ్ తోనూ దోస్తీ చేసేందుకు పవన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ, తమిళనాడులో సక్సెస్ అయితే నెమ్మదిగా కర్ణాటక, కేరళతోపాటు తెలంగాణలోనూ బీజేపీకి బలం పెంచే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. 

అమిత్ షాతో ఏకాంత భేటీ.. 
బీజేపీ అగ్ర నేతలతో చనువుగా ఉంటున్న పవన్ అవకాశం దొరికినప్పుడల్లా కలుస్తూ కీలక చర్చలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం సాయంత్రం కేంద్రమంత్రి అమిత్ షాతో ఒక్కడే భేటీ కానుండటంపై ప్రాధాన్యత సంతరించుకుంది. దక్షిణాదిలో ఏపీతోపాటు పలు రాష్ట్రాల్లోనూ చేపట్టాల్సిన కార్యచరణపై పవన్ కు అమిషా దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో చేపట్టాల్సిన  వ్యూహాలకు సంబంధించి పవన్ కు అమిషా వివరించనున్నట్లు సన్నిహిత వర్గాల్లో చర్చ నడుస్తోంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు