Telangana High Court: సీఎం రేవంత్‌పై కేసు పెట్టాలని పిటిషన్! TG: బీఆర్ఎస్ నేతలను నిందిస్తూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఏరోళ్ల శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. సీఎంపై పిటిషన్ వేయడానికి పిటిషనర్‌కు అర్హత లేదని, విచారణార్హం కాదని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. By V.J Reddy 07 Nov 2024 in తెలంగాణ మహబూబ్ నగర్ New Update షేర్ చేయండి CM Revanth Reddy : బీఆర్ఎస్ నేతలను నిందిస్తూ వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి పై ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు నిన్న విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టలేం అని తేల్చి చెప్పింది. . సీఎం పలు సమావేశాల్లో అనేక అంశాలపై మాట్లాడుతుంటారని, వాటిని తప్పుగా పరిగణించి కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది. ఎర్రోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. Also Read : యంగ్ హీరోతో పెళ్లి కి రెడీ అయిన ప్రభాస్ హీరోయిన్..!? కేటీఆర్, హరీష్ పై ఘాటు వ్యాఖ్యలు... తెలంగాణలో ఇంకా ఎన్నికల ఫీవర్ తగ్గలేదు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల నేతల నడుమ మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రు కేటీఆర్, హరీష్ రావు విమర్శలు గుప్పిస్తుంటే.. దానికి కౌంటర్ గా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రతి విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా బీఆర్ఎస్ నేతలను నిందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రసంగాలపై గత నెల అక్టోబర్ 22న ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు సీఎం రేవంత్ పై కేసు నమోదు చేసేందుకు నిరాకరించారు. దీంతో బంజారాహిల్స్ పోలీసుల తీరుపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. Also Read : రాష్ట్రంలో స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. డబ్బులు కూడా ఇస్తారు..! సీఎం రేవంత్ పై రెండు కేసులు! సీఎం రేవంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ నిన్న హైకోర్టులో విచారణకు వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలంటూ దాఖలైన పిటిషన్ విచారణార్హం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. సీఎం పలు సమావేశాల్లో అనేక అంశాలపై మాట్లాడుతుంటారని.. వాటన్నిటిని తప్పుగా పరిగణించి కేసు నమోదు చేయలేమని అభిప్రాయపడింది. కాగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిపై రెండు కేసులో కోర్టులో నడుస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఓటుకు నోటు కేసు ఉండగా.. మరొకటి ఎంపీ ఎన్నికల సమయంలో కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందనిపై బీజేపీ నేత వేసిన కేసు. ఈ రెండు కేసులు ప్రస్తుతం కోర్టులో నడుస్తున్నాయి. Also Read : ట్రేడింగ్ పేరుతో స్కాం.. హైదరాబాద్ ఐటీ ఉద్యోగికి రూ.2.29 కోట్ల టోకరా Also Read : నాని - శ్రీకాంత్ ఓదెల మూవీకి డిఫరెంట్ టైటిల్.. అస్సలు ఉహించలేదే #brs #ktr #revanth-reddy #telangana-high-court #harish-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి