/rtv/media/media_files/2025/07/26/maoist-top-leader-surrenders-2025-07-26-14-05-26.jpg)
Big shock for Maoists...Maoist top leader surrenders
Maoist Leader Surrender : మావోయిస్టులకు మరో షాక్ తగిలింది. పలువురు మావోయిస్టు అగ్రనేతలు ఈ రోజు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు ఏపీ డీజీపీ ఎదుట పలువురు కీలక మావోయిస్టులు లొంగిపోయారు. వారి నుంచి భారీగా ఆయుధ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో సుమారు 34 ఏళ్లకు పైగా పని చేసిన సీనియర్ మావోయిస్టు జోరిగె నాగరాజు అలియాస్ కమలేశ్, ఆయన భార్య అరుణ అలియాస్ మేదక జ్యోతీశ్వరి ఉన్నారు. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీశ్ కుమార్ గుప్తా ముందు శనివారం లొంగిపోయారు.
Also Read : ఖాళీ కడుపుతో మద్యం తాగడం మంచిదేనా? అందరూ చేసే తప్పే ఇది!
ప్రస్తుతం కమలేశ్ తూర్పు బస్తర్ డివిజనల్ కమిటీకి ఇన్చార్జిగా పనిచేస్తూ, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో ఎస్‌జెడ్‌సీఎం హోదాలో ఉన్నారు. కాగా వరుస ఎన్ కౌంటర్లు, లొంగుబాట్లతో పాటు మావోయిస్టు పార్టీ వైఫల్యాలు, కేంద్ర కమిటీ విధానాలపై విసుగు చెంది ఆయన లొంగిపోయారని అధికారులు తెలిపారు. ఆయన భార్య అరుణ, మొబైల్ అకడమిక్ పొలిటికల్ ఆర్గనైజేషన్ స్కూల్‌కి ఇన్ఛార్జ్‌గా పనిచేస్తున్నారు. కమలేశ్‌పై ఏపీలో రూ.20 లక్షల రివార్డు, అరుణ పై 5 లక్షల రూపాయల రివార్డు ఉందని అధికారులు వెల్లడించారు. ఇక, లొంగిపోయిన దంపతులకు తక్షణ సాయంగా ఒక్కొక్కరికి రూ.20,000 చొప్పున చెక్కులను డీజీపీ అందజేశారు.
Also Read : పవిత్రమైన శ్రావణ మాసం.. ఈ పనులు చేశారో దరిద్ర దేవత మీ నెత్తిమీదే!
మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలీస్ ఆపరేషన్ బృందాలు గత వారంలో రికవరీ చేసిన 18 ఆయుధాలను ఏపీ డీజీపీ హరిశ్ కుమార్ గుప్తాకి అధికారులు చూపించారు. వీటిలో 1 ఏకే-47, 2 బీజీఎల్‌లు, 5 ఎస్ఎల్ఆర్‌లు, 2 ఐఎన్ఎస్ఏఎస్ రైఫిళ్లు, 606 లైవ్ రౌండ్లు, 37 కిలోల కార్డెక్స్ వైర్లు, ఇతర పరికరాలు ఉన్నాయి. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ ఈ మధ్య లొంగిపోయిన మడకం దేవా అలియాస్ భగత్ (డివిజనల్ కమిటీ సభ్యుడు) సహా 13 మంది యూజీ కేడర్‌కు చెందినవిగా ఆయన తెలిపారు. కాగా లొంగిపోయిన నక్సల్స్‌కు రూ.22 లక్షల విలువైన చెక్కులను డీజీపీ అందజేశారు. గత ఏడాది కాలంలో మొత్తం రూ.64 లక్షల రివార్డులను వివిధ హోదాల్లో లొంగిపోయిన 48 మంది కేడర్‌కు అందజేసినట్లు ఆయన తెలిపారు.
ఎన్ కౌంటర్
మరోవైపు జార్ఖండ్ గామ్లా జిల్లాలోని ఘాగ్రా అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, సెక్యూరిటీ ఫోర్సెస్‌కు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో సీపీఐ (మావోయిస్ట్) నుంచి విడిపోయిన జార్ఖండ్ జన్ ముక్తి పరిషద్ (JJMP) సభ్యులు ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. అదేవిధంగా మావోయిస్టు సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని జార్ఖండ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఆపరేషన్స్) మైఖేల్ ఎస్.రాజ్ వెల్లడించారు. తమ భద్రతా బలగాలకు మావోయిస్టులు ఎదురుపడగా.. లొంగిపొమ్మని చెప్పినా వారు వినకుండా కాల్పులు జరిపారని, ప్రాణ రక్షణ కోసం తాము ఫైర్ ఓపెన్ చేశామని ఆయన తెలిపారు. తమవైపు నుంచి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు.
Also Read : తిరుపతిలో కన్ను తెరిచిన శివయ్య.. గతంలో ఇలాంటి ఘటనలు ఎక్కడెక్కడ జరిగాయో తెలుసా?
Also Read : ఏపీలో విషాదం.. ప్రియుడి ఇంటిముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ప్రియురాలు