ISRO: సెంచరీ కొట్టనున్న ఇస్రో..రేపే ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వరుసపెట్టి ప్రయోగాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇస్రో సెంచరీకి చేరువైంది. రేపు తన వందో ప్రయోగాన్ని నింగిలోకి పంపనుంది. 

author-image
By Manogna alamuru
New Update
isro

ISRO's 100th Rocket GSLV 15

విదేశీలతో పోటీ పడ్డమే కాదు ఎప్పటికప్పుడు తమ స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ముందుకు దూసుకెళుతోంది ఇస్రో. గతేడాది చంద్రయాన్ తో సక్సెస్ కొట్టిన ఇస్రో అత్యుత్తమ అంతరిక్ష సంస్థగా ఎదిగింది.  తక్కువ ఖర్చుతో మెరుగైన, ఎక్కువ ప్రయోగాలను చేపడుతోంది. చేపట్టిన అన్ని ప్రయోగాల్లో సక్సెస్ సాధిస్తోంది. ఇలా ఇప్పటివరకు తొంభై తొమ్మిది ప్రయోగాలను చేసింది ఇస్రో. రేపు తన వందో ప్రయోగాన్ని  నింగిలోకి పంపేందుకు సిద్ధమైంది. శ్రీహరికోటలో జిఎస్ఎల్వి ఎఫ్-15 కౌంట్ డౌన్ మొదలైంది. అర్ధరాత్రి 2గంటల 53 నిమిషాలకు  కౌన్ డౌన్ ప్రారంభించారు.  దీనిని 29వ తేది ఉదయం 6 గంటల 23 నిమిషాలకు నింగిలోకి పంపిచనున్నారు. 

Also Read: Davos: పెట్టుబడులు, చర్చలు ఒకవైపు...శృంగారం మరోవైపు..దావోస్ లో పారిశ్రామిక వేత్తల భాగోతం

మరింత అభిృద్ధి..

రేపు నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌15 రాకెట్‌ను నింగిలోకి పంపేందుకు అంతా సిద్ధం చేసింది ఇస్రో. మొదట్లో ఏడాదికి ఒక ప్రయోగాన్ని ప్రయోగించేది. అది కూడా కష్గంగా ఉండేది. కానీ తరవాత తన పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ వరుసపెట్టి ప్రయోగాలు చేయడం మొదలుపెట్టింది.  ఇప్పుడు ఏడాదికి  4 నుంచి పది ప్రయోగాలు చేపట్టే స్థాయికి ఎదిగింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్యను 15కు పెంచేలా షార్‌లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే  80 శాతం పనులు పూర్తయ్యాయి.

సక్సెస్ ఫుల్ గా డాకింగ్..

రీసెంట్ గా 2024 డిసెంబర్ చివరి వారంలో, స్పేడెక్స్ మిషన్‌లో భాగంగా ఇస్రో ప్రయోగించిన PSLV C- 60  షార్ నుంచి చేసిన 99వ ప్రయోగం చేశారు.  ఈ ప్రయోగంలోనే ఇస్రో అంతరిక్షంలో రెండు శాటిలైట్లను డాకింగ్ చేసి, డాకింగ్ సామర్థ్యం ఉన్న నాలుగో దేశంగా చరిత్ర సృష్టించింది. కొత్త సంవత్సరంలో శాటిలైట్ల డాకింగ్ ను సక్సెస్ ఫుల్ గా చేసింది. 

వందో ప్రయోగంలో..

ఇస్రో చేపట్టిన వందో ప్రయోగం జీఎస్ఎల్వీ 15 రాకెట్ తో దేశ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌ అయిన నావిక్‌లో భాగమైన SVN 02 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపిస్తోంది. ఈ నావిక్‌ అనేది స్వదేశీ ప్రాంతీయ నావిగేషన్‌ ఉపగ్రహ వ్యవస్థ. ఇది భారత విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలకు ఉపయోగపడనుంది. ఈ వ్యవస్థ ద్వారా భారత్‌తో పాటు భారత్ సరిహద్దుల నుంచి 1500 కిలోమీటర్ల పరిధి వరకూ కచ్చితమైన నావిగేషన్ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఇప్పటివరకూ ఇలాంటి నావిక్ లను చాలానే పంపించింది ఇస్రో. అయితే ఈ కొత్త దానిలో మరింత లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించింది. ఇందులో భాగంగా, స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అటామిక్ క్లాక్‌ను పంపిస్తోంది. ఇంతకు ముందు ఈ టెక్నాలజీ కోసం రష్యా మీద ఆధారపడిన భారత్ ఇప్పుడు స్వయంగా ఈ టెక్నాలజీని తయారు చేసుకుంది. అంతేకాదు ఇన్నాళ్లుగా భారత గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ నావిక్‌ను రిసీవ్ చేసుకునే రిసీవర్లు చాలా పెద్దవిగా ఉండేవి. కానీ ఇప్పుడు చేస్తున్న ఈ వందో ప్రయోగంతో చిన్న చిప్ లెవెల్ పరికరాలు అంటే...స్మార్ట్ వాచ్ లాంటి వాటిల్లో కూడా  నావిక్ సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవచ్చును.

Also Read: USA: ఫిబ్రవరిలో అమెరికాకు భారత ప్రధాని

 

 

 

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు