/rtv/media/media_files/2025/01/20/6Vt3V6s6Cm0jUufTYbHs.jpeg)
Attack on Dalits
కర్ణాటకలోని విజయపుర జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు దళిత కార్మికులపై కొందరు విచక్షణారహితంగా దాడి చేశారు. పనికి వచ్చేందుకు నిరాకరించారనే కారణంలో ఇటుక బట్టిల యజమానీ, అతడి కుటుంబ సభ్యులు ఆ ముగ్గురు వ్యక్తులపై తీవ్రంగా దాడి చేశారు. ఇంతకీ అసలేందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. నాగంత నియోజకవర్గంలోని గాంధీనగర్ ఏరియాలో సదాశివ మదర్, సదాశివ బాబాలాడి, ఉమేశ్ మదర్ అనే ముగ్గురు వ్యక్తులు ఓ ఇటుక బట్టిలో పనిచేస్తున్నారు. వీళ్లలో ఒక్కక్కరికీ రోజుకు రూ.600 వరకు కూలీ వచ్చేది. అయితే ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా వీళ్లు తమ సొంతుర్లకు వెళ్లారు.
Also Read: సైఫ్‌పై దాడి జరిగేటప్పుడు నలుగురు మగ పనిమనుషులు అక్కడే.. వెలుగులోకి సంచలన నిజాలు
జనవరి 16న మళ్లీ తిరిగి వాళ్లు పనిచేసే ఇటుక బట్టి ప్రాంతానికి వచ్చారు. కానీ వాళ్లు అక్కడ పనిచేసేందుకు మొగ్గుచూపలేదు. ఆ పనిని విడిచిపెట్టి తమ వస్తువులను తీసుకొని వెళ్లిపోతున్నారని ఆ ఇటుక బట్టి ఓనర్‌కు తెలిసింది. దీంతో వాళ్ల దగ్గరికి వెళ్లి ఎందుకు పనికి రావడం లేదని ప్రశ్నించాడు. ఆ తర్వాత తన బంధువులను పిలిపించి.. ఆ ముగ్గురుపై విచక్షణారహితంగా కొట్టించేలా చేశాడు. ఆ ముగ్గురిని ఓనర్ బంధువులు పైపులు, కర్రలతో దారుణంగా కొట్టారు. వాళ్లు నొప్పితో అరిచినా కూడా ఆ ఓనర్, తన బంధువులు మాత్రం విడిచిపెట్టలేదు. మూడు రోజుల పాటు వాళ్లని అలా కొడుతూనే ఉన్నారు.
అంతేకాదు వాళ్లను గన్‌తో బెదిరించారు, వారి కళ్లల్లోకి కారం పొడిని కూడా చల్లారు. ప్రస్తుతం ఆ ముగ్గురు దళిత కార్మికులు విజయపుర జిల్లా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే వారిని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది. నెటీజన్లు ఆ ఇటుక బట్టి ఓనర్, తన బంధువులపై తీవ్రంగా మండిపడుతున్నారు. చివరికి పోలీసుల దృష్టికి ఈ విషయం రావడంతో.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇటుక భట్టి ఓనర్ కేము రాథోడ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం అతడి ఆచూకి కోసం గాలిస్తున్నారు.
Also Read: సంజయ్ రాయ్‌కు ఉరిశిక్ష ఇందుకే విధించలేదా..?