AP News: రజని నిన్ను వదలను.. తిన్నదంతా కక్కిస్తాం: మాజీ మంత్రికి ఎమ్మెల్యే వార్నింగ్!

మాజీమంత్రి విడదల రజని, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మధ్య వివాదం మరింత ముదిరింది. ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్నారు. రజిని అరాచకాలు మొత్తం బయటకు తీసి తిన్నదంతా కక్కిస్తామని పుల్లరావు అన్నారు. రజని అతనికి మాస్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

New Update
rajani ap

AP TDP MLA Prathipati Pullarao strong warning to vidudala rajani

ఏపీ వైసీపీ మాజీమంత్రి విడదల రజనిపై పల్నాజు జిల్లా చిలకలూరిపేట టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సంచలన ఆరోపణలు చేశారు. చిలకలూరిపేటలో అరాచకాలు చేసి గుంటూరు పారిపోయిందన్నారు. తన అనుచరులతో లెక్కలేనన్ని అవినీతి పనులు చేసి గుంటూరుకి వెళ్లిపోయిందంటూ మండిపడ్డారు. ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో మరోసారి చిలకలూరిపేటకి వచ్చిందన్నారు. ఈ విషయాలన్ని మర్చిపోతే ఎలా? నీకు ఓటేసిన ప్రజల్ని, చిలకలూరిపేట వాసుల్ని పూర్తిగా నాశనం చేశావ్ అంటూ రజనీపై తీవ్ర విమర్శలు చేశారు. 

Also Read :  జగన్‌ను వాళ్లే ముంచేశారు.. చంద్రబాబుకు చచ్చిన తర్వాత నరకం తప్పదు: కేఏపాల్ సంచలనం

తిన్నదంతా కక్కిస్తాం

ఈ మేరకు శనివారం మీడియాతో మాట్లాడదిన పుల్లరావు..  మేము ఏ తప్పు చేయలేదు. దేనికైనా రెడీ. రజిని నువ్వు ఏడు నెలలు ఎక్కడ దాక్కున్నావు. రజిని అరాచకాలు మొత్తం బయటకు తీసి తిన్నదంతా కక్కిస్తాం. దమ్ముంటే రజిని ఈ ఐదేళ్లు పురుషోత్తమపట్నంలోనే ఉండాలి. జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి అండ చూసుకొని విపరీతమైన అరాచకాలు చేశావు. రాబోయే రోజుల్లో నిన్ను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదంటూ సవల్ విసిరారు. 

ఇది కూడా చదవండి; Delhi Elections 2025: బీజేపీని గెలిపించారు.. ఆప్‌ను ముంచారు.. ఢిల్లీ రిజల్ట్స్‌ను రివర్స్ చేసిన జంపింగ్‌లు!

ఇదిలా ఉంటే.. రజనీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదవడంతో చర్చనీయాంశమైంది. ఈ కేసుపై రజనీ తీవ్రంగా స్పందించారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావుతోపాటు అధికారులపై మండిపడ్డారు. మాస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఎన్డీయే ప్రభుత్వంపై విరుచుకుపడిన ఆమె.. 'పుల్లారావు ఒక అందమైన కట్టు కథ మళ్లీ నాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు పెట్టించాడు. 80 ఏళ్ల పైబడిన మా మామగారిపై కేసు పెట్టారు. ఎక్కడో విదేశాల్లో ఉంటున్న మా మరిదిపై అక్రమ కేసు పెట్టించాడు. పుల్లారావు మా కుటుంబంపై అక్రమ కేసులు పెట్టించి కక్ష సాధిస్తున్నాడన్నారు. 

Also Read :  రెండో వన్డేలో కోహ్లీ ఆడతాడా? లేదా?.. ఫిట్‌నెస్‌పై అప్‌డేట్‌ ఇచ్చిన బ్యాటింగ్ కోచ్!

Also Read :  ప్రాణం తీసిన ఈత సరదా...బతుకు తెరువుకోసం వచ్చి...

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు