Adinimmayapalli dam : ప్రాణం తీసిన ఈత సరదా...బతుకు తెరువుకోసం వచ్చి...

కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో విషాదం చోటుచేసుకుంది. నియోజకవర్గంలోని ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట వద్ద ఈత కొట్టేందుకు వెళ్లిన యువకుల్లో ఇద్దరు గల్లంతయ్యారు. వారికోసం పోలీసులు తీవ్రంగా గాలించి ఎట్టకేలకు మృతదేహాలను వెలికితీశారు. మృతులు నేపాల్ కు చెందినవారు.

New Update
MISSING

MISSING

Adinimmayapalli dam : కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో విషాదం చోటుచేసుకుంది. నియోజకవర్గంలోని ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట వద్ద ఈత కొట్టేందుకు వెళ్లిన యువకుల్లో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వారికోసం పోలీసులు తీవ్రంగా గాలించి ఎట్టకేలకు మృతదేహాలను వెలికితీశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చెన్నూరులోని శివరాం దమ్‌ బిర్యాని హోటల్‌లో నేపాల్‌కు చెందిన పలువురు యువకులు పనిచేస్తున్నారు. అయితే ఈరోజు శనివారం హోటల్‌ సెలవుదినం కావడంతో హోటల్‌లో పనిచేసే నేపాల్‌ కు చెందిన పదిమంది యువకులు కమలాపూర్‌ సమీపంలోని ఆది నిమ్మాయపల్లి డ్యాం వద్దకు సరదాగా ఎంజాయ్‌ చేయడానికి వెళ్లారు. అందరూ నీటిలో దిగి ఈత కొడుతుండగా వారిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. 

Also Read : ఓటీటీలో సుదీప్ కిచ్చా మ్యాక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

గల్లంతయినవారిలో బిరి(22), బీరేంద్ర(30)లు ఉన్నట్లు తోటి యువకులు తెలిపారు. యువకులు గల్లంతయిన విషయం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే సంఘటన స్థలానికి చెరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీఐ రోషన్ ఆధ్వర్యంలో మృతదేహాల కోసం పోలీసులు, ఫైర్‌ సిబ్బంది, జాలర్లు ముమ్మరంగా గాలించి ఇద్దరు యువకుల మృతదేహాలను వెలికి తీశారు. కాగా మృతుల కుటుంబసభ్యులంతా నేపాల్‌లోనే ఉన్నారు. బతుకు తెరువుకోసం చెన్నూరుకు వచ్చిన ఈ యువకులు స్థానికంగా ఉన్న శివరాం హోటల్‌లో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.

ఇది కూడా చదవండి: PM Modi: ఢిల్లీని గెలిచిన మోదీ.. నెక్ట్స్ టార్గెట్ ఈ రాష్ట్రాలే!

కాగా కుటుంబాలను వదిలిపెట్టి బతుకుతెరువుకోసం భారతదేశానికి వచ్చిన యువకులు అనుకోకుండా మృత్యువాత పడడంతో తోటి యువకులు కన్నీరుమున్నీరయ్యారు. తమతో కలిసి అప్పటివరకు ఆనందంగా గడిపిన స్నేహితులు లేరని తెలిసి ఆ యువకులు ఏడుస్తున్న తీరు అక్కడున్న ప్రతి ఒక్కరిని కదిలించింది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు దేశం కానీ దేశానికి వచ్చి అర్థంతరంగా  కనుమూయడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా సీఐ రోషన్‌ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Delhi Results: 27 ఏళ్ల తర్వాత బీజేపీ గెలుపు.. ప్రధాన కారణాలు ఇవే !

Advertisment