/rtv/media/media_files/2024/11/03/sbZR9y9lbjK63Yy1FTw3.jpg)
Ration Cards
ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్‌లో రేషన్ కార్డులు సేవలు ప్రారంభమయ్యాయి. 9552300009 నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేస్తే సేవలను ఎంచుకోవాలనే ఆప్షన్ వస్తుంది. ఆ తర్వాత మీరు పౌర సేవలు, సివిల్ సప్లయిస్ సేవలపై క్లిక్ చేయాలి. ఇలా చేశాక దీపం స్థిత, రైస్ డ్రా, ఈకేవైసీ, రైస్ కార్డు సమర్పణ, ఆధార్ సీడింగ్, కార్డు విభజన వంటి 8 సేవలు కనిపిస్తాయి.
ఇది కూడా చూడండి: Spirit Movie: దీపికా ఔట్.. యానిమల్ బ్యూటీ ఇన్.. ప్రభాస్‌తో రొమాన్స్‌కి బోల్డ్ బ్యూటీ
కొత్త రైస్ కార్డులకు దరఖాస్తు చేసుకునే ఆప్షన్..
వీటిలో అన్ని వివరాలు నమోదు చేసి వాట్సాప్ ద్వారానే రేషన్ కార్డులకు అప్లై చేసుకోవచ్చు. అయితే రేషన్ కార్డులో మార్పులు చేసుకోవడం, ఇతర సేవలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ కొత్త రైస్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే ఆప్షన్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: PM Modi-CM Revanth: ఆ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వండి.. మోదీకి సీఎం రేవంత్ రిక్వెస్ట్!
ఇదిలా ఉండగా మిగతా సేవల కోసం గ్రామ, వార్డు సచివాలయాలను సంప్రదించాలి. ఇక్కడ కొత్త రైస్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎక్కువ మంది రావడంతో సర్వర్లు డౌన్ అయిపోవడంతో వాటిని ఆన్‌లైన్ చేయలేకపోతున్నారు. ఈ క్రమంలోనే మన మిత్ర సేవలను తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం తెలిపింది.
ఇది కూడా చూడండి: Pregnant Woman Dies: హాస్పిటల్ సిబ్బంది తప్పుతో 2 ప్రాణాలు బలి.. ఏం జరిగిందంటే?
ఈ క్రమంలో శనివారం నుంచి ఈ వాట్సాప్ సేవలను ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వాట్సాప్ సేవల వల్ల ప్రజలకు కాస్త సమయం కలసి వస్తుంది. కొన్ని సెకన్ల సమయంలోనే మీరు ఈ వాట్సాప్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఇది కూడా చూడండి: Wine: ఈ వైన్ రోజుకీ ఒక సిప్ తాగితే.. కలిగే ప్రయోజనాలు తెలిస్తే తాగకుండా ఉండరు