AP New Ration Cards: కొత్త రేషన్ కార్డులు కావాలా?.. వాట్సాప్‌లో ఇలా చేస్తే చాలు

ఏపీలో కూటమి ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. మనమిత్ర కింద రేషన్ సేవలు అందించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. అర్హత ఉండి రేషన్ కార్డ్ లేకపోతే 9552300009 వాట్సాప్ నెంబర్‌కు హాయ్ అని మేసేజ్ చేసి అప్లై చేసుకోవచ్చు.

New Update
ap new ration cards 2025 apply through whatsapp

ap new ration cards 2025 apply through whatsapp

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా రేషన్ కార్డులు అందించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఈ నెల అంటే మే 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్‌లో కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా మనమిత్ర కింద రేషన్ సేవలు అందరికీ అందించాలని సీఎం చంద్రబాబు అధికారులకు తెలిపారు. 

AP New Ration Cards

అయితే అర్హత ఉండి ఇప్పటి వరకు రేషన్ కార్డు లేనివారు వాట్సాప్‌లో అప్లై చేస్తే సరిపోతుంది. దీని ద్వారా రేషన్ కార్డు నేరుగా ఇంటికే వచ్చేస్తుంది. 95523 00009 ఈ వాట్సాప్  నెంబర్‌కు HI అని మేసేజ్ చేసి ఈ సేవలను పొందొచ్చు. ఈ విధంగా కాకపోతే మరో ఆప్షన్ కూడా ఉంది. రేషన్ కార్డు కావాలసిన లబ్దిదారులు సచివాలయాల్లో కూడా అప్లై చేసుకుని పొందవచ్చు. 

Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!

దీని కోసం ఈ నెల అంటే మే 7వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా పాత రేషన్ కార్డుల్లో ఏవైనా తప్పులు ఉంటే.. వాటిని మార్పులు చేర్పులు చేసుకునే వీలు కల్పించారు. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు అధికారులకు మరిన్ని ఆదేశాలు జారీ చేశారు. 

Also Read: మదర్స్ డే స్పెషల్.. అమ్మ కోసం ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్

ఈ సేవలతో ప్రజలు పూర్తిగా సంతృప్తి చెందేలా అందించాలని తెలిపారు. ఎక్కడ కూడా రేషన్ బియ్యం రీ సైక్లింగ్ జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని తెలిపారు. కాగా రైస్ కార్డులో పేర్లు ఉన్నప్పటికీ GSWS డేటాలో లేని 79,173 మంది వివరాలను పరిశీలించి వాటిని వెంటనే క్లియర్ చేయాలని అన్నారు. 

Also Read: మీ ఇళ్లను పేల్చేస్తాం.. పాకిస్తాన్ నుంచి తిరుపతికి ఫోన్ కాల్స్ కలకలం!

cm chandrababu | ration-cards | new ration cards in ap | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు