ఢిల్లీలో తెలంగాణ రాజకీయాలు.. ప్రశాంత్ కిషోర్తో మంత్రి నారా లోకేష్‌ భేటీ!

రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్‌తో ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ అయినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీ బలోపేతంపై ప్రశాంత్ కిషోర్‌తో లోకేష్ చర్చించినట్లుగా సమాచారం. పార్టీ బలోపేతంపై ఇప్పటికే కొన్ని ప్రణాళికలను టీడీపీ పెద్దల ముందు ఉంచినట్లు సమాచారం.

New Update
lokesh vs prashant

lokesh vs prashant

దేశరాజధాని ఢిల్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్‌తో ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలోని సీఎం నివాసం 1-జన్‌పథ్‌కు ప్రశాంత్ కిషోర్ వచ్చారని.. అక్కడ మంత్రి లోకేష్ తో దాదాపుగా గంటపాటు సమావేశం అయ్యారని మీడియాలో కథనాలు వస్తున్నాయి.  ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించినట్లుగా తెలుస్తోంది.అయితే వీరి భేటీకి సంబంధించిన వివరాలపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం లేదు. 

Also Read :  ప్రముఖ వ్యాపారవేత్త పింకీ రెడ్డి ఫోన్ హ్యాక్! రిప్లై ఇవ్వదంటూ పోస్ట్

టీడీపీ పార్టీ బలోపేతంపై  

అయితే ప్రధానంగా తెలుస్తోన్న విషయం ఏంటంటే.. తెలంగాణలో టీడీపీ పార్టీ బలోపేతంపై  ప్రశాంత్ కిషోర్‌తో లోకేష్ చర్చించినట్లుగా సమాచారం.  పార్టీ బలోపేతంపై ఇప్పటికే కొన్ని ప్రణాళికలను టీడీపీ పెద్దల ముందు ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది. సంకీర్ణ ప్రభుత్వంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోషిస్తున్న పాత్రపై వారు చర్చించినట్టు సమాచారం.   బీహార్ లోని రాజకీయాల పరిస్థితి, తన ప్రణాళికలను లోకేష్‌కు వివరించినట్లు తెలిసింది. 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్‌ వైసీపీకి పనిచేసింది. అనంతరం ఐప్యాక్‌ నుంచి బయటకు వచ్చిన ఆయన తన సొంత రాష్ట్రమైన బీహార్ లో జన్‌ సురాజ్‌ అనే పేరుతో ఓ పార్టీని ఏర్పాటు చేశారు.  

Also Read :  పాపం పెళ్లై మూడు నెలలు కూడా కాలేదు..ఎంతకు తెగించార్రా!

2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ టీడీపీకి పూర్తికాల వ్యూహకర్తగా పనిచేయకపోయినా సలహాదారుగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. లోకేష్ , సీఎం చంద్రబాబుతో చర్చించడానికి ఆయన రెండుసార్లు అమరావతికి విమానంలో వచ్చారు. ఆ ఎన్నికల్లో జగన్ తిరిగి అధికారంలోకి వస్తారని  మిగతా ఏజెన్సీలన్నీ అంచనా వేసినప్పటికీ, వైఎస్‌ఆర్‌సిపికి భారీ ఓటమి తప్పదని ప్రశాంత్ కిషోర్ అంచనా వేసిజ అది నిజమని నిరూపించారు. 

Also Read :  మహాకుంభమేళాకు చేరుకున్న మోదీ... త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం

Advertisment
తాజా కథనాలు