మంచు ఫ్యామిలీ వివాదాలకు సౌందర్యతో లింక్.. అసలు విషయం తెలిస్తే షాక్!

మంచు ఫ్యామిలీలో వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే సౌందర్య ఆస్తి గురించే వీరి మధ్య వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. అసలు మంచు ఫ్యామిలీకి హీరోయిన్  సౌందర్య  ఆస్తులకు సంబంధమేంటి..? తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి. 

New Update
manchu family (1)

manchu family dispute

Manchu Family: హీరోయిన్ సౌందర్య గుర్తుంది కదా? ఆమె మరణించి రెండు దశాబ్దాలు గడుస్తున్నా..  ఇప్పటికీ ఆమెకు సంబంధించిన వార్తలు ప్రజలకు చాలా దగ్గరవుతూనే ఉన్నాయి. అలాంటి క్రేజ్ ఆమెకు ఉండేది. అయితే తాజాగా మంచు ఫ్యామిలీలో వివాదాలకు సౌందర్యకు ఓ లింక్‌ ఉన్నట్లు వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. సౌందర్య ఆస్తి గురించే వీరి మధ్య వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. అసలు మంచు ఫ్యామిలీకి హీరోయిన్  సౌందర్య  ఆస్తులకు సంబంధమేంటి..?  దీని వెనుక ఉన్న కథేంటి అనేది తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి. 

మంచు ఫ్యామిలీలో వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మొన్నటి వరకు నాలుగు గోడల మధ్య ఉన్న వీళ్ళ గొడవ..  ఇప్పుడు రచ్చకెక్కడం చర్చనీయాంశమైంది.  మంచు మనోజ్, తండ్రి మోహన్ బాబు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఇంతటితో ఆగలేదు.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం.. మరో వైపు మోహన్ బాబు.. ప్రశ్నించేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులపై చేయి చేసుకోవడం రచ్చ రచ్చగా మారింది.  

Also Read: మొత్తం బంగారమే.. శోభిత వెడ్డింగ్ చీర గురించి ఈ విషయాలు తెలుసా..?

మంచు ఆస్తులకు సౌందర్యకు లింకేంటి..? 

ఈ వివాదానికి 20 ఏళ్ళ క్రితం మరణించిన సౌందర్యకు సంబంధమేంటి..? అయితే ప్రస్తుతం మోహన్ బాబు ఫ్యామిలీ  శంషాబాద్ శివారు ప్రాతంలోని జల్ పల్లి లోని విలాసవంతమైన బంగ్లాలో నివాసం ఉంటున్నారు. కాగా, ఈ బంగ్లా కట్టిన స్థలం అలనాటి హీరోయిన్ సౌందర్యదట. ఆమె స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలో సంపాదించిన డబ్బుతో ఆ స్థలం కొన్నారట. అయితే సౌందర్య మరణించిన తర్వాత మోహన్ బాబు అతి తక్కువ ధరకు ఆమె ఫ్యామిలీ నుంచి  ఆ స్థలాన్ని కొనుగోలు చేశారని అంటున్నారు. ఇక్కడ మరో వాదన కూడా వినిపిస్తోంది.  అసలు ఆ స్థలాన్ని మోహన్ బాబు సౌందర్య ఫ్యామిలీ నుంచి లాక్కున్నారని కూడా టాక్. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఆస్తి విలువ రూ. 100 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. 

ఆ స్థలం కోసమే వివాదం? 

కాగా, ఇప్పుడు ఈ బంగ్లా, స్థలం కోసమే మంచు ఫ్యామిలీలో వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. ఆస్తుల పంపకాల్లో ఈ స్థలం, ఇళ్ళు తనకు రావాలని మనోజ్ అంటున్నారట. కానీ మనోజ్ భూమా మౌనికను పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని మోహన్ బాబు, మంచు విష్ణు ఇల్లును ఇవ్వడానికి నిరాకరించారట. వీరి పెళ్ళైనప్పటి నుంచే కుటుంబంలో దీనికి సంబంధించి వివాదాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మౌనిక మొదటి భర్త కుమారుడు మనోజ్ తో ఉండడం కూడా మోహన్ బాబు ఫ్యామిలీకి ఇష్టం లేదట. 

Also Read: రచ్చ లేపుతున్న మంచు ఫ్యామిలీ ఫైట్‌.. ముంబై పారిపోయిన మంచు లక్ష్మి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు