![HMPV virus india](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2025/01/02/6VW2UYsKwvxMRTm3l4Qv.jpg)
Noro Virus
అమెరికాలో మరో కొత్త వైరస్ హడలెత్తిస్తోంది. ప్రస్తుతం అక్కడ నోరో అనే వైరస్ విజృంభిస్తోంది. డిసెంబర్ మొదటి వారంలోనే ఏకంగా 91 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ వైరస్‌కు సంబంధించి యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పలు కీలక విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం నోరో వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. నవంబర్ మొదటి వారంలోనే 69 కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ మొదటివారంలో ఈ సంఖ్య 91కి చేరింది. ఈ అంటువ్యాధి వైరస్ సోకినవారు వాంతులు, విరేచనాలకు గురవుతున్నారు.
Also Read: ప్రేమికురాలి కోసం పాకిస్థాన్‌కు వెళ్లిన యూపీ వాసి.. చివరికీ ఊహించని షాక్
నోరో వైరస్ అంటే
నోరో వైరస్‌ను కడుపు ఫ్లూ లేదా కడుపు బిగ్ అని కూడా అంటారు. ఈ వ్యాధి జీర్ణకోశానికి సోకుతుంది. దీనివల్ల వాంతులు, విరేచనాలు కలిగడంతో రోగులు డీహైడ్రేట్ అయిపోతారు. అంతేకాదు కడుపులో లేదా ప్రేగులలో మంటకు కూడా దారితీస్తుంది. ఈ కండిషన్‌ను అక్యూట్ గ్యాస్ట్రోఎంటెరిటిస్ అంటారు. ఈ వ్యాధి సోకిన తర్వాత చాలామంది 1 నుంచి 3 రోజుల్లో కోలుకుంటారు. కానీ ఈ వైరస్ వ్యాప్తి వేగంగా ఉంటుంది. ఇది సోకిన వారి నుంచి నేరుగా సోకే ఛాన్స్ ఉంది.
Also Read: తెలంగాణ మంత్రుల వేలకోట్ల కుంభకోణం.. నా దగ్గర ప్రూఫ్స్: ఏలేటి సంచలనం
అయితే ఈ వైరస్ సోకిన 12 నుంచి 48 గంటల తర్వాత లక్షణాలు కనిపిస్తున్నాయి. వాంతులు రావడం, వికారం, జ్వరం, కడుపునొప్పి, బాడి నొప్పులు, తలనొప్పి ఉంటాయి. అంతేకాదు మూత్రం సరిగా రాకపోవడం, నోరు పొడిబారడం, కళ్లు తిరగడం, అసాధరణమైన నిద్ర లేదా లేదా గందరగోళం లాంటి లక్షణాలు ఉంటాయి. వైరస్ సోకిన తర్వాత రెండ్రోజుల పాటు వీటి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత తగ్గుముఖం పడుతుంది. అనారోగ్యంతో ఉన్నవారు, పిల్లలు, సీనియర్ సిటిజన్స్‌ల్లో ఈ కేసులు ఎక్కువగా కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అక్కడి వైద్యులు హెచ్చరిస్తున్నారు.