AP GAS SYLINDERS: మహిళలకు బిగ్‌ అలర్ట్‌.. ఇలా చేయకపోతే ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ క్యాన్సిల్!

ఏపీ మహిళలకు బిగ్‌ అలర్ట్‌. ఇప్పటివరకు గ్యాస్‌ సిలిండర్‌ తీసుకోని వారు మార్చి ఆఖరికల్లా మొదటి సిలిండర్‌ను బుక్ చేసుకోవాలని పౌరసరఫరాలశాఖ సూచించింది. లేదంటే మూడు సిలిండర్లలో ఒకటి కోల్పోతారని అధికారులు తెలిపారు. 

New Update
free gas cylinder scheme

AP government key announcement on free gas booking

AP GAS SYLINDERS: సూపర్‌ సిక్స్‌ హామీల్లో ఒకటైన దీపం-2 పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే లబ్ధిదారులను అలర్ట్‌ చేసింది. ఇప్పటివరకు గ్యాస్‌ సిలిండర్‌ తీసుకోని వారు.. మార్చి ఆఖరికల్లా మొదటి సిలిండర్‌ను బుక్ చేసుకోవాలని సూచించింది. లేదంటే మూడు సిలిండర్లలో ఒకటి కోల్పోతారని పౌరసరఫరాల అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు గ్యాస్‌ బుక్‌ చేసుకోనివారికి ఇదే లాస్ట్‌ ఛాన్స్‌ అని హెచ్చరించారు. 

రేషన్‌కార్డే ప్రామాణికం..

2024 అక్టోబర్‌ 31 నుంచి ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీని ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. రేషన్‌కార్డే ప్రామాణికంగా దీపం- 2 పథకాన్ని అమలు చేస్తోంది. ఇందుకు అక్టోబరు 29 నుంచే ఉచిత గ్యాస్‌ సిలిండర్లు బుక్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ పథకం కింద ఇప్పటివరకు 97 లక్షల మంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్‌ సిలిండర్ లభించింది. ఇక ఏప్రిల్‌ నుంచి రెండో సిలిండర్‌ బుకింగ్‌లు ప్రారంభమవుతాయి. కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరిట కనెక్షన్‌ ఉందో వారి పేరు కచ్చితంగా రేషన్‌ కార్డులో ఉంటేనే రాయితీ వర్తిస్తుంది. 

Also read :  ఆ విషయంలో నేనే నంబర్.1.. ఢిల్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

ఈకేవైసీ తప్పనిసరి.. 

ఇక ఉచిత సిలిండర్‌ కోసం గ్యాస్ ఏజెన్సీలో ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి. అప్పుడే ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ రాయితీ పొందొచ్చు. ఈకేవైసీ చేసుకోకపోయినా, ప్రతినెలా రేషన్‌ తీసుకోకపోయినా, 300 యూనిట్లకుపైగా విద్యుత్తు వినియోగం, ప్రభుత్వ ఉద్యోగులు, కారు ఉన్నా ఈ దీపం పథకం వర్తించదు. దీపం-2 లబ్ధిదారులు ఆన్‌లైన్‌లో లేదా డీలర్‌ దగ్గరకు వెళ్లి గ్యాస్‌ బుక్‌ చేసుకోవచ్చు. లబ్ధిదారులు అధికారుల సూచనలను దృష్టిలో ఉంచుకుని వెంటనే గ్యాస్‌ సిలిండర్‌ను బుక్‌ చేసుకోని ఫ్రీ గ్యాస్ ను మిస్ చేసుకోవద్దని సూచించారు. 

Also read : ఇది కదా హారర్ అంటే.. పట్టపగలే వణుకు పుట్టించే థ్రిల్లర్..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు