Raghu Rama Krishnam Raju: రఘురామ కృష్ణంరాజు కేసులో బిగ్ ట్విస్ట్...  సునీల్‌నాయక్‌కు నోటీసులు !

టీడీపీ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై హత్యాయత్నం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.  ఐపీఎస్‌ అధికారి సునీల్‌నాయక్‌ను విచారణకు పిలుస్తూ పోలీసులు  నోటీసులు పంపారు.  ఫ్యాక్స్, వాట్సప్‌ ద్వారా ప్రకాశం జిల్లా ఎస్పీ ఆయనకు నోటీసులు పంపారు.  

New Update
raghu rama case

టీడీపీ (TDP) ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు (Raghu Rama Krishnam Raju) పై హత్యాయత్నం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.  ఐపీఎస్‌ అధికారి సునీల్‌నాయక్‌ను విచారణకు పిలుస్తూ పోలీసులు  నోటీసులు పంపారు.  ఫ్యాక్స్, వాట్సప్‌ ద్వారా ప్రకాశం జిల్లా ఎస్పీ ఆయనకు నోటీసులు పంపారు.  హైదరాబాద్ లో  రఘురామ కృష్ణంరాజును అరెస్ట్ చేసి గుంటూరు సీఐడీ కార్యాలయానికి తీసుకువచ్చినప్పుడు  సునీల్ కూడా వచ్చారని అధికారులు గుర్తించారు. దీంతో ఇందులో ఆయన పాత్రపై విచారించేందుకు నోటీసులు పంపారు.  సునీల్‌నాయక్‌ను విచారించాలని ఎస్పీ దామోదర్ ఆదేశాలు జారీ చేశారు.

Also Read :  దారుణ హత్య... సూట్‌కేస్‌లో కాంగ్రెస్ మహిళా కార్యకర్త డెడ్ బాడీ!

Also Read :  న్యూజిలాండ్ తో భారత్ మ్యాచ్ ఈరోజు.. విజయపరంపర కొనసాగిస్తుందా..

అగ్నిమాపక విభాగంలో డీఐజీగా

బిహార్ (Bihar) క్యాడర్ కు చెందిన సునీల్‌నాయక్‌ గత ప్రభుత్వ హయాంలో ఏపీ సీఐడీ డీఐజీగా పనిచేశారు.  కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే  బీహార్ కు వెళ్లిపోయారు.  ప్రస్తుతం అక్కడ అగ్నిమాపక విభాగంలో డీఐజీగా పనిచేస్తున్నారు. ఆయనకు నోటీసులు పంపిన విషయాన్ని ఆ విభాగం ఉన్నతాధికారులకూ సమాచారం ఇచ్చారు. గతంలో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన  రఘురామ కృష్ణంరాజు 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ గా కొనసాగుతున్నారు.

Also Read :  Passport Rules: పాస్‌పోర్ట్ రూల్స్ మారినయ్.. కొత్త నిబంధనలు ఇవే!

Also read :  కండరాల నొప్పులా.. అరటిపండ్లు, కొబ్బరి నీళ్లతో ఇన్ని లాభాలున్నాయా..? కానీ ఇలా ట్రై చేయకండి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు