ప్రేమించిన అమ్మాయిని దూరం చేశారని.. యువకుడు చేసిన పనికి అంతా షాక్!

ప్రేమించిన అమ్మాయిని తనకు దూరం చేశారని పగపెంచుకున్న బల్వీర్ అనే యువకుడు ఆమె తండ్రిపై ఎయిర్ పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. ఈ ఘటన ఆదివారం సరూర్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

New Update
young man shoots girlfriend father

అమ్మాయిని ప్రేమిస్తున్నాని స్కూల్ టైం నుంచే వేధించాడు. కానీ ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. ఆఖరికి కాలేజ్ టైంలో కూడా ఆమె వెంటే పడ్డాడు. ఎన్ని సార్లు నో చెప్పినా ఆ యువకుడి వేధింపులు ఆగలేదు. దీంతో విషయం తెలిసి అమ్మాయి తండ్రి తన ప్లాన్ ప్రకారం ఓ పని చేశాడు. అది నచ్చకపోవడంతో ఆ యువకుడు పిస్టల్‌తో అమ్మాయి తండ్రిపై కాల్పులు జరిపాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పులు.. ఆర్మీ జవాను మృతి

ప్రేమ పేరుతో వేధింపులు

హైదరాబాద్‌ సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో ఓ వ్యాపారి నివాసముంటున్నాడు. అతడికి ఇద్దరు కుమార్తెలు. అందులో చిన్న కుమార్తెకు స్కూల్ టైం నుంచే ఆమెతోపాటు చదువుతున్న విద్యార్థి, అంబర్ పేటకు చెందిన 25 ఏళ్ల గోగికార్ బల్వీర్ అనే యువకుడు ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. ఇక స్కూల్ అనంతరం ఇద్దరూ ఒకే కాలేజీలో ఇంజినీరింగ్ జాయిన్ అయ్యారు. 

Also Read:  కుంకుమ పువ్వు సాగు.. కిలో రూ.5 లక్షలు పలుకుతున్న ధర

అక్కడ కూడా ఆ యువతికి బల్వీర్ నుంచి వేధింపులు ఆగలేదు. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి తండ్రి బల్వీర్‌కు కొన్ని నెలల ముందు వార్నింగ్ ఇచ్చాడు. అప్పటి నుంచి బల్వీర్ అతడిపై కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా ఆ యువతి తండ్రిని చంపేస్తానని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని తన ఫ్రెండ్స్‌తో కూడా చెప్పాడు. ఇందులో భాగంగానే ఓ రోజు వారి ఇంటికి వెళ్లి గొడవ కూడా చేశాడు.

Also Read: గంభీర్‌ కు బిగ్ షాక్.. కోచ్ పదవినుంచి ఔట్!?

ఇదంతా తలనొప్పిగా మారడంతో తన కుమార్తెను ఆయన విదేశాలకు పంపించేశాడు. దీంతో ఆమెను తనకు దక్కకుండా చేస్తున్నారని పగ పెంచుకున్న బల్వీర్.. ఆదివారం ఆ యువతి ఇంటికి వెళ్లాడు. అనంతరం యువతి తండ్రిపై ఎయిర్ పిస్టల్‌తో ఒకరౌండ్ కాల్పులు జరిపాడు.

Also Read: రష్యాలో ఉద్రిక్తత.. మాస్కోపై 34 డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్..

ఈ ప్రమాదంలో ఆయన కుడి కన్నుపై తీవ్ర గాయం అయింది. బల్వీర్ అక్కడితో ఆగకుండా కారు అద్దాలను ధ్వంసం చేసి పరారయ్యాడు. క్షతగాత్రుడిని కుటుంబ సభ్యులు హాస్పిటల్‌లో చేర్పించి పోలీసులకు సమాచారం అందించారు. రంగం లోకి దిగిన పోలీసులు నిందితుడు బల్వీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు