/rtv/media/media_files/2024/12/28/ISloIXQi3xnrdW39pkm3.jpg)
Australia free offer
Australia: ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో దారుణం జరిగింది. బాక్సింగ్ డే సందర్భంగా ఓ స్టోర్ ఓనర్ ఇచ్చిన బట్టలు ఫ్రీ ఆఫర్ పెట్టడంతో జనం భారీగా ఎగబడ్డారు. దీంతో స్టోర్‌లో తొక్కిసలాట జరగగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
టీషర్టులు ఉచితంగా ఇస్తానంటూ..
ఈ మేరకు బాక్సింగ్ డే సందర్భంగా స్ట్రీట్ ఎక్స్ అనే బట్టల షాప్ ఓనర్ డేనియల్ బ్రాడ్‌షా.. టీషర్టులు ఉచితంగా ఇస్తానంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేశాడు. దీంతో ఆఫర్ ప్రకటన పెద్ద ఎత్తున వైరల్ కావడతో వందలాది మంది ఆ స్టోర్ వద్దకు వచ్చారు. షాప్ ఓపెన్ చేయడమే ఆలస్యం ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకోగా పలువురు గాయాలయ్యాయి. కొంతమంది ముందు జాగ్రత్తతో హెల్మెట్, ప్యాడ్స్ ధరించి రావడం విశేషం. కాగా ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన ఓనర్ డేనియల్ బ్రాడ్‌షా.. సరదా కోసమే ఇలా చేశానని చెప్పాడు. 400 వస్తువులు కేవలం 30 సెకన్లలో తీసుకెళ్లిపోయారన్నాడు. అయితే ఎవరికీ గాయాలు కాలేదని, ఒకరి చేతుల్లోంచి ఒకరు దుస్తులు లాక్కోవడంతో చిన్న చిన్న గొడవు జరిగాయన్నారు.