Jagan: జగన్ మళ్లీ జైలుకు వెళ్లక తప్పదా..? ఆయన బెయిల్ రద్దుకు ప్రయత్నం జరుగుతోందా..? సీబీఐ కేసుల్లో విచారణ వేగవంతం చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టిందా..? అమిత్‌షాతో పవన్ భేటీ వెనుక కారణం ఇదేనా..? అంటే అవుననే పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల ఢిల్లీకి వెళ్లారు. ఈ ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దలు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ అయ్యారు. ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి, ఇతర పెండింగు ప్రాజెక్టుల గురించి చర్చించినట్లు సమాచారం. కేవలం ఇంతేనా? ఈ విషయాలు మాట్లాడడానికే పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లారా? కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే హడావుడిగా బయల్దేరి ఢిల్లీ వెళ్లింది ఇందుకేనే అనే రకరకాల అంశాలపై చర్చ జరుగుతోంది.
Also Read: వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు బిగ్ షాక్.. ఇక డబ్బులు కట్టాల్సిందే!
సీక్రెట్ అజెండా ఇదేనా..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి హోం మంత్రి అమిత్ షాతో భేటీ కావడం వెనుక అసలు సీక్రెట్ ఎజెండా మరొకటి ఉన్నదని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా జరుగుతోంది. సరస్వతీ పవర్ భూములను ఆలంబనగా చేసుకుని జగన్ ను టార్గెట్ చేయాలని పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. వారి కుటుంబ తగాదాగా ఈ వివాదం బయటకు వచ్చిన రోజునే పవన్ కళ్యాణ్ అప్రమత్తమై సరస్వతీ పవర్‌కు చెందిన వాటిలో ప్రభుత్వ భూములు ఉన్నాయేమో చూడాలని అధికారులను ఆదేశించారు.
Also Read: జగన్ మళ్లీ జైలుకు.. ఢిల్లీలో చక్రం తిప్పిన పవన్!
అలాగే ఇటీవల సోషల్ మీడియాలో దుష్ప్రచారంపైనా పవన్ వైసీపీకి హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే జగన్ బెయిల్ రద్దుకు అమిత్ షా వద్ద పవన్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. సీబీఐ కేసుల్లో విచారణ వేగవంతం చేసి ఆయనను మళ్లీ జైలుకు పంపేలా కేంద్రం చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. జగన్ మళ్లీ జైలుకు వెళితే ఈసారి వైసీపీకి నాయకత్వం కరువవుతుంది. ఇప్పటికే పలువురు ఆ పార్టీ నాయకులు ఎప్పుడెప్పుడు ఇతర పార్టీలోకి వెళ్లిపోదామా అన్న ఆత్రుతలో ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్ జైలుకు వెళితే వైసీపీ ప్లేసును బీజేపీ, జనసేన భర్తీ చేసేలా అమిత్‌షా, పవన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: జూబ్లిహిల్స్ రెస్టారెంట్‌లో భారీ పేలుడు.. ధ్వంసమైన ఇళ్లు
Also Read: వైద్య శాస్త్రంలోనే మిరాకిల్.. చనిపోయిందనుకున్న శిశువు కానీ..