National Police Memorial Day: దేశ వ్యాప్తంగా ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం..
దేశ వ్యాప్తంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. అమరవీరులను స్మరించుకుంటూ.. వారికి నివాళులు అర్పిస్తూ దేశ వ్యాప్తంగా పోలీసులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహిస్తూ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని నేషనల్ పోలీస్ మెమోరియల్ వద్ద జరిగిన జాతీయ పోలీస్ స్మారక దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. పోలీసుల అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు.