వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు బిగ్ షాక్.. ఇక డబ్బులు కట్టాల్సిందే! వాట్సాప్‌లో గ్రూప్ క్రియేట్ చేయాలంటే 50 డాలర్లు చెల్లించి లైసెన్స్ తీసుకోవాలనే కొత్త నిబంధనను జింబాబ్వే తీసుకొచ్చింది. తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టేందుకు ఆ దేశ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. By Kusuma 10 Nov 2024 | నవీకరించబడింది పై 10 Nov 2024 09:57 IST in ఇంటర్నేషనల్ బిజినెస్ New Update షేర్ చేయండి తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టేందుకు జింబాబ్వే ప్రభుత్వం కొత్త రూల్‌ను తీసుకొచ్చింది. సాధారణంగా వాట్సాప్ గ్రూప్‌లకు ఎవరైనా అడ్మిన్‌లు ఉండవచ్చు. అడ్మిన్‌గా ఉండాలన్నా, గ్రూప్ క్రియేట్ చేయాలన్నా కూడా ఎలాంటి డబ్బులు చెల్లించక్కర్లేదు. కానీ ఇకపై జింబాబ్వేలో వాట్సాప్ గ్రూప్ చేయాలంటే మాత్రం అడ్మిన్లు డబ్బులు చెల్లించాలనే కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఇది కూడా చూడండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి లైసెన్స్ పొందాలంటే డబ్బులు తప్పకుండా.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లు అందరూ కూడా జింబాబ్వే పోస్ట్ అండ్ టెలికమ్యునికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీలో నమోదు చేసుకుని, గ్రూప్‌ను నిర్వహించడానికి లైసెన్స్ పొందాలి. ఈ లైసెన్స్ పొందడం కోసం కనీసం 50 డాలర్లు అంటే సుమారుగా రూ.4200 చెల్లించాలని జింబాబ్వే సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ, పోస్టల్ అండ్ కొరియర్ సర్వీసెస్ మంత్రి తటెండా మావెటెరా ప్రకటించారు. ఇది కూడా చూడండి: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్ తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా ఉండకుండా, దేశంలో శాంతి ఉండాలని ఈ నిర్ణయం తీసుకుంది. ఆ దేశ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం జింబాబ్వే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉన్న పౌరుల వ్యక్తిగత డేటా లీక్ కాకుండా ఉండాలని అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ లైసెన్స్ తీసుకోకపోతే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడానికి కుదరదని తెలిపింది. ఇది కూడా చూడండి: దారుణం.. టీచర్లు బ్లాక్ మెయిల్ చేస్తూ నీట్ విద్యార్థిపై.. ఈ లైసెన్స్ వల్ల వాట్సాప్ గ్రూప్‌లలో ఫేక్ న్యూస్ ప్రచారం కావడం కాస్త తగ్గు్తుంది. దీనివల్ల పౌరుల వ్యక్తిగత డేటా సురక్షితంగా ఉంటుందనే కారణంతో ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చారు. దీనివల్ల ఇకపై వాట్సాప్ గ్రూప్‌లలో తప్పుడు సమాచారం ప్రచారం కాదు. ఈ కొత్త రూల్ వల్ల పౌరుల డేటా సురక్షితంగా ఉంటుంది. ఇది కూడా చూడండి: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు #zimbabwe #Whatsapp Group Admin మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి