ఈ రోజు ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు చెందిన మంత్రిత్వ శాఖలకు భారీగా నిధులను కేటాయించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు రూ.16,739 కోట్లను కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇంకా పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖలకు రూ.687 కోట్లను కేటాయిస్తున్నట్లు చెప్పారు. గత ఎన్నికల్లో కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించిన పవన్ కల్యాన్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు అనేక కీలక మంత్రిత్వ శాఖలను కేటాయించారు చంద్రబాబు.
Also Read: రేవంత్‌పై కోపాన్ని రైతులు వాళ్లపై చూపిస్తున్నారు: హరీష్ రావు
Also Read: బాణసంచా కాల్చడంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
త్వరలో వినూత్న కార్యక్రమాలు..
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖలను పవన్ కల్యాణ్ కు కేటాయించారు. పవన్ కల్యాణే తన అభిరుచికి అనుగుణంగా ఈ శాఖలను ఏరికోరి తీసుకున్నారనే ప్రచారం సాగింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయా శాఖలపై తన ప్రత్యేక ముద్ర ఉండేలా చూసుకుంటూ విధులు నిర్వర్తిస్తున్నారు పవన్ కల్యాణ్. ఇందుకు అనుగుణంగా ఈ రోజు ప్రవేశ పెట్టిన చంద్రబాబు సర్కార్ పవన్ కల్యాణ్ శాఖలకు భారీగా నిధులు కేటాయించనట్లు తెలుస్తోంది. దీంతో పవన్ తన శాఖలకు సంబంధించి మరిన్ని వినూత్న కార్యక్రమాలు ప్రారంభించే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.
Also Read: ఎల్లుండే జార్ఖండ్‌లో ఎన్నికలు..కీలక అంశాలివే..
Also Read: రుషికొండ ఫైల్స్ మిస్సింగ్.. తలలు పట్టుకుంటున్న అధికారులు