Vallabhaneni Vamshi: పాలిటిక్స్ మొదలు పెట్టిన వల్లభనేని వంశీ.. మళ్లీ యాక్టీవ్-VIDEO

గన్నవరం మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని మళ్లీ యాక్టీవ్ అయ్యారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తాజాగా ఓ వాటర్ ట్యాంకర్ ను ప్రారంభించారు. దీంతో వంశీ మళ్లీ పాలిటిక్స్ ప్రారంభించడని వైసీపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

New Update
Vallabhaneni Vamshi Gannavaram

గత ఎన్నికలు ముగిసిన నాటి నుంచి గుడివాడ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(vallabhaneni-vamshi).. ఎక్కువగా నియోజకవర్గంలో కనబడడం లేదు. ప్రభుత్వం మారిన తర్వాత ఆయనపై 11 కేసులు నమోదయ్యాయి. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లారు వంశీ. ఆ తర్వాత అరెస్ట్ కూడా అయ్యారు. 140 రోజుల పాటు రాజమండ్రి జైలులో ఉన్నారు వంశీ. ఆ సమయంలో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అనారోగ్య కారణాల రిత్యా న్యాయస్థానం వంశీకి బెయిల్ మంజూరు చేసింది. 

Also Read :  ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసిందోచ్.. ఎప్పట్నుంచంటే?

Vallabhaneni Vamshi Active In Gannavaram Politics

అయితే.. విడుదలైన తర్వాత కూడా వంశీ ఎక్కడా పెద్దగా కనిపించలేదు. రాజకీయల(andhra-pradesh-politics) నుంచి వంశీ తప్పుకుంటున్నాడన్న ప్రచారం కూడా సోషల్ మీడియాలో జోరుగా సాగింది. ఆ వార్తలకు చెక్ పెడుతూ వంశీ మళ్లీ యాక్టీవ్ అయ్యారు. నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తాజాగా ఓ తాగు నీటి ట్యాంకర్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

టీడీపీ(tdp) తో రాజకీయ రంగ ప్రవేశం చేసిన వల్లభనేని వంశీ ఆ పార్టీ నుంచి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా 2009 ఎన్నికల్లో బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి లగడపాటి రాజగోపాల్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2014లో గన్నవరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వంశీ విజయం సాధించారు. 2019లో కూడా పోటీ చేసిన వంశీ వైసీపీ హవాలోనూ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీకి దూరమై వైసీపీకి దగ్గరయ్యారు. ఈ క్రమంలో చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలు వంశీపై ఉన్నాయి. దీంతో టీడీపీకి ఆయన బద్ధ శత్రువుగా మారారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు చేతిలో ఓటమిపాలయ్యారు.

Also Read :  చంద్రబాబు, జగన్ నివాసాల్లో బాంబులు.. తిరుపతిలో కూడా.. సంచలన మెయిల్!

అప్పటి నుంచి హైదరాబాద్ కే పరిమితం అయ్యారు. భారీగా కేసులు నమోదు కావడంతో అరెస్టుకు భయపడే వల్లభనేని వంశీ హైదరాబాద్ లో ఉన్నాడన్న ప్రచారం సాగింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 16న ఏపీ పోలీసులు హైదరాబాద్ లో ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం 140 రోజుల పాటు వంశీ జైలు జీవితం గడిపారు. ఆ సమయంలోనే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురై గుర్తు పట్టలేనంతగా మారిపోయారు వంశీ. చికిత్స అనంతరం ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. దీంతో మళ్లీ పొలిటికల్ గా యాక్టీవ్ అయినట్లు సమాచారం. అయితే.. జైలు నుంచి విడుదలైన నాటి నుంచి ఒక్క సారి కూడా ఆయన ఎక్కడా ఎలాంటి మీడియా సమావేశం నిర్వహించలేదు. తన అరెస్ట్ తదితర పరిణామాలపై స్పందించలేదు. 

Advertisment
తాజా కథనాలు