/rtv/media/media_files/2025/10/03/ap-inter-2026-exam-schedule-2025-10-03-18-01-34.jpg)
AP Inter 2026 Exam Schedule
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల (IPE) షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ విద్యా మండలి రిలీజ్ చేసింది. 2026 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి షెడ్యూల్‌ను విడుదల చేశారు. దీంతో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు జరగనున్నాయి.
Also Read : NWR Railways Recruitment 2025 : 10వ తరగతితో రైల్వే ఉద్యోగాలు.. 898 ఖాళీలకు నోటిఫికేషన్
AP Inter 2026 Exam Schedule
కాగా ఈ సారి పరీక్షల నిర్వహణలో కొన్ని మార్పులు తీసుకువచ్చారు. గతంలో పబ్లిక్ పరీక్షలు మార్చిలో జరిగేవి కానీ ఈ సారి సీబీఎస్‌ఈతో సమానంగా ఒక నెల ముందుగానే అంటే ఫిబ్రవరిలోనే నిర్ణయించారు. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను బోర్డు తన అఫీషియల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
అదే సమయంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక జనవరి 23న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జరగనుంది. స్టూడెంట్స్ ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఉండాలని విద్యాశాఖ మంత్రి తెలిపారు. అందువల్ల ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు పూర్తి షెడ్యూల్‌నుhttps://bie.ap.gov.in/ లో చెక్ చేసుకోవచ్చు.
Also Read : ఆ కంపెనీ ఉద్యోగులకు బిగ్ షాక్.. బలవంతంగా రిజైన్.. ఒక్కసారిగా 80 వేల మందిపై వేటు!