/rtv/media/media_files/WPr5txFkWyxdklUVpERn.jpg)
నెల్లూరులో వైసీపీకి మరో బిగ్‌షాక్ తగిలే ఛాన్స్ కనిపిస్తోంది. మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి ఎమ్మెల్యేగా పోట చేసి ఓడి పోయారు ఆదాల. అప్పటి నుంచి పార్టీలో గుర్తింపు లేదని.. పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నటలు సమాచారం. అయితే, ఆదాల ప్రభాకర్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారు? అన్న చర్చ ఉమ్మడి నెల్లూరు పాలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. అయితే.. ఆయన రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటారని సన్నిహితులు చెబుతున్నారు.
Also Read : మీరు మనుషులేనారా ? ఇంటర్ విద్యార్థినిని రేప్ చేసిన లెక్చరర్లు
Also Read : క్రేజీ అప్డేట్.. 'మహారాజ' డైరెక్టర్ తో తలైవా నెక్స్ట్ ప్రాజెక్ట్!
అప్పటి నుంచి పాలిటిక్స్ కు దూరం..
గతంలో టీడీపీ, కాంగ్రెస్ నుంచి ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆయన వైసీపీలో చేరారు. నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. అయితే.. నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరడంతో ఆదాలను ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా బరిలోకి దించింది వైసీపీ. గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి కోటంరెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి నెల్లూరు పాలిటిక్స్ కు ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు.
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన విజయసాయిరెడ్డి ఇప్పటికే జగన్ కు గుడ్ బై చెప్పారు. తాను పాలిటిక్స్ కు దూరం అంటూనే పరోక్షంగా వైసీపీ నేతలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు ఆదాల కూడా పార్టీకి దూరం అయితే వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.
Also Read : భట్టికి బిగ్ షాక్..రూ.25 కోట్ల పరువు నష్టం దావా? బీజేపీ చీఫ్ నోటీసులు
Also Read : ఆ విద్యార్థుల కుటుంబాలకు రూ.3 లక్షల సాయం.. ఏపీ సర్కార్ కీలక ప్రకటన!
telugu breaking news | latest-telugu-news | telugu-news | Adala Prabhakar Reddy