/rtv/media/media_files/2025/05/21/0CFNzYLOvZNyTZ1EuyFb.jpg)
AP Fire Accident
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం నిధి భవన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో విధులు నిర్వర్తిస్తున్న 300 మంది ఉద్యోగులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. అయితే.. ఏసీలో షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. అయితే.. సరైన సమయానికి అగ్నిమాపాక సిబ్బంది రావడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే.. ప్రమాదంలో ముఖ్యమైన ఫైల్స్ ఏమైనా దగ్ధం అయ్యాయా? అన్న విషయం తేలాల్సి ఉంది. అయితే.. ప్రస్తుతం ఫైర్ సిబ్బందిని తప్పా.. ఎవరినీ కార్యాలయం లోపలికి అధికారులు అనుమతించడం లేదు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, చీఫ్ సెక్రటరీ తదితరులు కొద్ది సేపట్లో నిధి భవన్ ను సందర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: BIG BREAKING: పాకిస్థాన్‌లో స్కూల్ బస్సుపై ఉగ్రదాడి.. నలుగురు చిన్నారులు మృతి
గుంటూరు:మంగళగిరి లోని ఆటోనగర్ లో ఉన్న నిధి భవన్ లో షార్ట్ సర్క్యూట్..
— RTV (@RTVnewsnetwork) May 21, 2025
భయభ్రాంతులకు గురైన ఉద్యోగులు బయటకు పరుగులు
సరైన సమయానికి అగ్నిమాపాక సిబ్బంది రావడం తో ఊపిరి పీల్చుకున్న ఉద్యోగులు
గవర్నమెంట్ ఉద్యోగులకు ఈ ఆఫీస్ నుండే జీతాలు చెల్లిస్తారని సమాచారం
గవర్నమెంట్ కి ఇది… pic.twitter.com/rXPzcr1xH9
గత నెలలో సచివాలయంలో ప్రమాదం..
గత నెల 4న ఏపీ సచివాలయంలోనూ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రెండో అంతస్తులో బ్యాటరీలు ఉండే ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత తదితరులు ఉండే ముఖ్యమైన ఈ ఫ్లోర్ లో ప్రమాదం చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. అయితే.. ఉదయం సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ఇది కూడా చదవండి: BIG BREAKING: అకౌంట్‌లోకి రూ.15000 ఆ రోజే!
ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా పరిశీలించారు. సచివాలయం మొత్తం కవర్ చేసేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తద్వారా ఎలాంటి ప్రమాదం జరిగినా కారణాలను సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుదన్నారు. భద్రతా ప్రమాణాలపై ఆడిట్ చేయాలని అధికారులను ఆదేశించారు.
(telugu-news | telugu breaking news | latest-telugu-news)