/rtv/media/media_files/2025/05/21/BZF9fMmh6NWU2AM5QXds.jpg)
Suicide car bomber strikes school bus in Pakistan, 4 children killed
పాకిస్థాన్‌లో మరోసారి భారీ ఉగ్రదాడి జరిగింది. బలూచిస్థాన్లో ఖుజ్దార్‌లో ఓ స్కూల్ బస్సుపై ఉగ్రవాదులు సూసైడ్ కారు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు మరణించారు. మరో 38 మంది గాయాలపాలయ్యారు. స్కూల్ బస్సులో పిల్లలు ప్రయాణిస్తుండగానే ఈ ప్రమాదం జరిగిందని అక్కడి స్థానిక డిప్యూటీ కమిషనర్ తెలిపారు. అయితే ఈ దాడి ఎవరు చేశారో అనే దానిపై క్లారిటీ లేదు. ఇప్పటివరకు ఏ ఉగ్రసంస్థ దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు. అయితే బలూచిస్థాన్ రెబల్స్ ఈ దాడులకు పాల్పడొచ్చని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా బలూచిస్థాన్ రెబల్స్.. పాక్ భద్రతా బలగాలు, పౌరులపై ఆ ప్రాంతంలో దాడులకు పాల్పడ్డ సంగతి తెలిసిందే.
Also Read: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. నేడు, రేపు భారీ వర్షాలు
పాకిస్థాన్ అంతర్గత మంత్రి మోసిన్ నఖ్వీ ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. చనిపోయిన చిన్నారులకు సంతాపం తెలిపారు. ఈ దాడులకు పాల్పడ్డవారిని ఆయన మృగాలతో పోల్చారు. శత్రువులు అమాయకులైన చిన్నారులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు.. విచారణలో బయటపడ్డ షాకింగ్ విషయాలు
పాకిస్థాన్‌లో ఖైబర్ పంఖ్తువా ప్రావిన్స్‌లో అనుమానిత డ్రోన్ దాడి జరిగినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ దాడిలో నలుగురు చిన్నారులు మృతి చెందారని.. వాళ్లందరూ ఒకే కుటుంబానికి చెందినవాళ్లని పేర్కొన్నారు. మరో అయిదుగురికి గాయాలయ్యాయని చెప్పారు. సోమవారం పాక్ భద్రతా బలగాలు, తీవ్రవాదుల మధ్య కాల్పులు జరిగిన సమయంలో ఈ డ్రోన్ దాడి జరిగినట్లు వెల్లడించారు.
సోమవారం మధ్యాహ్నం హుర్ముజ్ అనే గ్రామంలోని ఓ ఇంటిలో ఈ డ్రోన్ దాడి జరిగినట్లు పేర్కొన్నారు. భారీ పేలుడు సంభవించడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు మృతి చెందారనట్లు స్పష్టం చేశారు. దీంతో అక్కడి స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళనలకు దిగారు. డ్రోన్ దాడికి కారణమైనవాళ్లని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
telugu-news | rtv-news | pakistan