AP Government: ఏపీ అసెంబ్లీలో ఏడు బిల్లులకు ఆమోదం..

ఏపీ ప్రభుత్వం ఏడు బిల్లులకు శాసనసభలో ఆమోదం తెలిపింది. ఏపీ పంచాయతీ రాజ్‌ సవరణ బిల్లు-2024, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్‌ నిరోధక బిల్లు-2024, ఏపీ మున్సిపల్ సవరణ తదితర ఏడు బిల్లులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
CBN

ఏపీ ప్రభుత్వం ఏడు బిల్లులకు శాసనసభలో ఆమోదం తెలిపింది. ఏపీ పంచాయతీ రాజ్‌ సవరణ బిల్లు-2024, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్‌ నిరోధక బిల్లు-2024, ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు-2024కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఎంతమంది పిల్లలున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించేలా నిబంధనలు మారుస్తూ తీసుకొచ్చిన బిల్లును కూడా శాసనసభ ఆమోదించింది. 

Also Read: పోలీసులను చితకొట్టిన అఘోరి.. ఈడ్చుకెళ్లి DCMలో పడేసి ఏం చేశారంటే?

AP Assembly

అలాగే ఆయుర్వేదిక్ హోమియోపతి మెడికల్ ప్రాక్టిషనర్స్ చట్ట సవరణ, ఏపీ మెడికల్ ప్రాక్టిషనర్స్ రిజిస్ట్రేషన్‌ చట్ట సవరణ బిల్లు-2024, ఎన్టీఆర్ హెల్త్‌ యూనివర్సిటీ సవరణ బిల్లు-2024 బిల్లులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు ఏపీ సహకారం సంఘం సవరణ బిల్లు-2024 ను కూడా అసెంబ్లీ ఆమోదించింది. ఈ తర్వాత అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు శాసనసభను మంగళవారానికి వాయిదా వేశారు.  

Also Read: పోటా పోటీగా మహారాష్ట్ర ఎన్నికలు.. అధికారంలోకి వచ్చేది ఎవరంటే ?

పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ నిబంధనలు మార్చడంతో ఎంతమంది పిల్లలున్నా నేతలు పోటీ చేసే అవకాశం లభించింది. జనభా వృద్ధి పెంపులో భాగంగా ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న నేతలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మరోవైపు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా 16 మంది పిల్లల్ని ఎందుకు కనకూడదంటూ వ్యాఖ్యానించారు. ఈ ఇద్దరు సీఎంలు చేసిన ప్రకటనలు దక్షిణాది రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: వైసీపీ ఎమ్మెల్యేకు నోటీసులు

2027లో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ జరగనుంది. దీనివల్ల ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు వస్తాయని.. దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ సీట్లు వస్తాయనే ప్రచారం జరుగుతోంది. గతంలో కేంద్ర ఆదేశాల ప్రకారం దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను పాటించగా.. ఉత్తరాది రాష్ట్రాలు దీన్ని సరిగ్గా అమలు చేయలేకపోయాయి. అందుకే దక్షిణాది కన్నా ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా ఎక్కువగా పెరిగిపోయింది. ఇప్పటికే దక్షిణాదిపై ఉత్తరాది రాష్ట్రాల పెత్తనం ఉందని.. నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియలో భారీగా తేడాలు వస్తే దక్షిణాది రాష్ట్రాల అభిప్రాయాలకు విలువలు మరింత తగ్గుతాయనే అంశం హాట్‌ టాపిక్‌గా మారింది.   

ఇది కూడా చూడండి: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన కీలకనేత

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు