పోలీసులను చితకొట్టిన అఘోరి.. ఈడ్చుకెళ్లి DCMలో పడేసి ఏం చేశారంటే? లేడీ అఘోరీ ఏపీలోని మంగళగిరిలో రచ్చరచ్చ చేస్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవాలంటూ రోడ్డుపై బైటాయించింది. దీంతో ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ఆమెకు సర్ది చెప్పారు. అదే సమయంలో అఘోరీ పోలీసులపై చేయి చేసుకోవడంతో.. ఆమెను ఈడ్చుకెళ్లి డిసిఎంలో ఎక్కించారు. By Seetha Ram 18 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి లేడీ అఘోరీ ఏపీలోని మంగళగిరిలో రచ్చ రచ్చ చేస్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవాలంటూ జనసేన పార్టీ ఆఫీసు ముందు బైటాయించింది. పవన్ కళ్యాణ్‌ను కలిశాకే అక్కడ నుంచి వెళ్తానంటూ రోడ్డుపైనే కూర్చుంది. ఆమెకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన పోలీసులపై రెచ్చిపోయింది. పోలీసులను కొట్టిన అఘోరి ఇది కూడా చదవండి: బిగ్ బ్రేకింగ్.. పవన్ బయటకు రా, జనసేన పార్టీ ఆఫీసు ఎదుట అఘోరి రచ్చ! రోడ్డుపై నుంచి ఆమెను పైకి లేపే క్రమంలో పోలీసులపైనే చేయిచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. రోడ్డు పై నుంచి లేవకపోవడంతో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. రహదారి పొడువునా వాహనాలు స్థంబించిపోయాయి. ఇది కూడా చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్ కొనేవారికి ప్రభుత్వం తీపికబురు.. 100శాతం మినహాయింపు దీంతో ఆమెను పైకి లేపే క్రమంలో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏకంగా పోలీసులపైనే చేయి చేసుకుంది. పోలీసు వాహనంలో ఎక్కమని చెబితే.. ఆ వాహనం డోరునే గట్టిగా వేసింది. ఆపై పోలీసులపై తిరగబడింది. ఏకంగా కానిస్టేబుల్ తలపై కొట్టింది. ఆ వీడియోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఇక లాభంలేదని భావించిన పోలీసులు సహనం విడిచి అఘోరిని ఒక పెద్ద డీసీఎంలో ఎక్కించారు. అఘోరీ కాళ్లు మొక్కిన డిప్యూటీ సీఎం భార్య ఇది కూడా చదవండి: పెళ్లికాని ప్రసాద్‌లే టార్గెట్.. పెళ్లి చేసుకుని లక్షల్లో కన్నం! అఘోరీ రీసెంట్‌గా తెలంగాణలో ప్రత్యక్షమైంది. ఇందులో భాగంగానే ఖమ్మం జిల్లా మధిరలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో అఘోరి పాల్గొంది. అనంతరం అదే వేడుకకు ముఖ్య అతిథిగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని హాజరైంది. దీంతో లేడీ అఘోరి అక్కడికి రాగానే నందిని ఆమె కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మసీదును కూల్చేస్తా ఇది కూడా చదవండి: అఘోరీ కాళ్లు మొక్కిన డిప్యూటీ సీఎం సతీమణి.. వీడియో వైరల్ ఇది కాకుండా మరో సంచలన వ్యాఖ్యలు చేసింది. హిందూ ఆలయాల ఆనవాళ్లు ఉన్న ప్రతి మసీదును కూల్చేస్తా అని షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వాలతో తనకు పనిలేదని తెలిపింది. తన పని తాను చేసుకుని పోతానని పేర్కొంది. ఆడపిల్ల మీద చేయి వేస్తే అది కోసేస్తా అని తెలిపింది. ధర్మం తర్వాతే ఏదైనా, ఎవరైనా అంటూ ఫైర్ అయింది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరప్పాడులో ప్రస్తుతం అఘోరి ఉంది. #police vs aghori #lady aghori #deputy-cm-pawan-kalyan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి