Kailash Gahlot: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన కీలకనేత

అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో కీలకనేతగా, ఢిల్లీ రవాణా శాఖా మంత్రిగా ఉన్న కైలాశ్ గెహ్లాట్ నేడు బీజేపీలో చేరారు. ఆప్ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఢిల్లీ రవాణా శాఖ మంత్రి పదవికి కూడా గెహ్లాట్ రాజీనామా చేసి కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ ఇచ్చాడు.

New Update
Kailash Gehlot

ఢిల్లీ రవాణా శాఖా మంత్రి కైలాశ్ గెహ్లాట్ ఆమ్ ఆద్మీ పార్టీకి నిన్న రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో కీలకనేతగా ఉన్న గెహ్లాట్ ఈ రోజు బీజేపీలోకి చేరారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కీలకనేత ఆప్ పార్టీని వీడి బీజేపీలోకి చేరడం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ అని చెప్పవచ్చు. ఆప్ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఢిల్లీ రవాణా శాఖ మంత్రి పదవికి కూడా గెహ్లాట్ రాజీనామా చేశారు. 

ఇది కూడా చదవండి: బిగ్‌ బ్రేకింగ్.. పవన్ బయటకు రా, జనసేన పార్టీ ఆఫీసు ఎదుట అఘోరి రచ్చ!

హామీలు నెరవేర్చలేదనే..

ఢిల్లీ రవాణా శాఖ మంత్రి‌గా ఉన్న కైలాష్ గెహ్లాట్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పదవికి కూడా నిన్న రాజీనామా చేశారు. ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్ల రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్ కొనేవారికి ప్రభుత్వం తీపికబురు.. 100శాతం మినహాయింపు

ఎన్నికల ముందు యమునా నదిని శుభ్రం చేస్తామని హామీ ఇచ్చామని.. కానీ ఈ హామీని అమలు చేయకపోలేకపోవడంతో పలు అంశాలను కూడా లేఖలో తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కైలాష్ గెహ్లాట్ రాజీనామాతో ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు.

ఇది కూడా చదవండి: పెళ్లికాని ప్రసాద్‌లే టార్గెట్.. పెళ్లి చేసుకుని లక్షల్లో కన్నం!

కైలాష్ గెహ్లాట్ ఢిల్లీ ప్రభుత్వంలో హోం, రవాణా, ఐటీ, మహిళా, శిశు అభివృద్ధితో సహా కీలకమైన వాటికి ఇన్‌ఛార్జ్‌గా చేశారు. ప్రస్తుతం రవాణా, పర్యావరణ మంత్రిగా ఉన్నారు. కైలాష్ గెహ్లాట్ ఢిల్లీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ లాస్, మాస్టర్ ఆఫ్ లాస్ డిగ్రీలు పొందారు. 1974లో జూలై 22న న్యూఢిల్లీలో జన్మించారు. 

ఇది కూడా చదవండి: అఘోరీ కాళ్లు మొక్కిన డిప్యూటీ సీఎం సతీమణి.. వీడియో వైరల్

Advertisment
Advertisment
తాజా కథనాలు