/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-01T094512.156.jpg)
Horoscope
మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బుద్ధిబలంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. గృహంలో అనుకూల వాతావరణం ఉంది. వృత్తి వ్యాపారాల వారికి ఆర్థిక అనుకూలత ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు.
Also Read: America-Russia: అమెరికాలో ఉద్రిక్తతలకు తెర పడనుందా...రష్యా ఏమంటుందంటే!
వృషభరాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలుంటాయి. మానసిక ఆనందం కలిగే సంఘటనలు జరుగుతాయి. ఆర్థిక లాభాలున్నాయి. ఎప్పటినుంచో వాయిదా పడుతున్న పనులు ఈ రోజు పూర్తి అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యమైన పనుల్లో మీ ప్రణాళికలు సత్ఫలితాన్నిస్తాయి.
Also Read: CEC: కేంద్ర ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేష్.. ఆయన బ్యాగ్రౌండ్ ఇదే..!
మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది. వ్యాపారంలో ఒడుదొడుకులు మానసికంగా ఇబ్బంది కలగవచ్చు.
తీవ్రమైన మానసిక ఒత్తిడితో..
కర్కాటకరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు, అవరోధాలతో సతమతమవుతారు. తీవ్రమైన మానసిక ఒత్తిడితో కుటుంబసభ్యులతో గొడవపడతారు. ధననష్టం సంభవించే పరిస్థితి ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండండి.
సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. కొందరి ప్రవర్తన మనస్తాపం కలిగిస్తుంది. నమ్మించి మోసం చేసే వారున్నారు జాగ్రత్తగా ఉండండి.
కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. కీలకమైన సమావేశాలలో మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగులు ఓ కీలకమైన ప్రాజెక్టులో సమయస్ఫూర్తితో వ్యవహరించి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఎప్పటినుంచో వాయిదా పడిన పనులు ఈ రోజు పూర్తవుతాయి.
తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ రోజు కళ, సాహిత్య రంగాల వారికి బాగుంది పనిలో మీ నైపుణ్యం మంచి గుర్తింపు తెస్తుంది. ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. ఆర్థికంగా బలపడతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం.
వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలు రాబట్టడానికి అనువైన సమయం నడుస్తోంది. మీ శక్తి సామర్ధ్యాలను పూర్తిగా వెచ్చిస్తే ఉన్నతస్థితికి చేరుతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.
ధనుస్సురాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. కుటుంబజీవితాన్ని సంపూర్ణంగా ఆనందిస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. ఆదాయంలో పెరుగుదల సంతృప్తిని కలిగిస్తుంది. విందువినోదాలలో పాల్గొంటారు.
మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. ప్రమాదకరమైన ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలను అధిగమిస్తారు. ఆర్ధికంగా ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఇతరుల ఒత్తిడితో కీలక నిర్ణయాలు తీసుకోవద్దు. మొహమాటాలకు దూరంగా ఉంటే మంచిది. వ్యాపారంలో పోటీ పెరుగుతుంది.
మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో జాప్యం జరుగుతుంది. సమయానికి పనులు పూర్తి కాకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఆర్ధిక పరమైన అంశాలలో జాగ్రత్తగా ఉండాలి. పెద్దల సలహాలు మేలు చేస్తాయి. గిట్టని వారి విమర్శలు పట్టించుకోవద్దు.
Also Read: Air Ambulance: గుడ్‌న్యూస్.. భారత్‌కు త్వరలో వర్టికల్ టేకాఫ్ ఎయిర్ అంబులెన్సులు
Also Read: ఇండియా బ్యాన్ చేసిన చైనా డ్రోన్ ఎగరేసిన రాహుల్ గాంధీ.. చివరికి ఏమైందంటే..?