/rtv/media/media_files/2025/07/21/ap-free-bus-scheme-2025-07-21-18-33-35.jpg)
AP Free Bus Scheme
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని తెలిపింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఇది ఒకటి. స్త్రీ పథకం కింద ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ ఉచిత ప్రయాణం అమలు కానుందని వెల్లడించింది. ఈ క్రమంలోనే నేటి నుంచి ప్రారంభం కానుంది. అయితే కేవలం జిల్లా స్థాయిలో మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణించవచ్చు. అయితే ఏపీ రాష్ట్రానికి చెందిన మహిళలు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చని కూటమి ప్రభుత్వం తెలిపింది. అయితే ఏపీ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం విషయంలో కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఏపీ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కోసం నేటి నుంచి స్త్రీ పథకం ప్రారంభం కానుంది. ఏపీ రాష్ట్రానికి చెందిన మహిళలు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చని కూటమి ప్రభుత్వం తెలిపింది.https://t.co/69g58j6HTE#AndhraPradesh#bus…
— RTV (@RTVnewsnetwork) August 15, 2025
ఇది కూడా చూడండి: Ambati Rambabu: పులివెందుల ఎన్నికపై ఫేక్ వీడియో.. అంబటి రాంబాబుకు బిగ్ షాక్.. ఏ క్షణమైనా అరెస్ట్?
స్త్రీశక్తి
— AP Digital Corporation (@apdigitalcorp) August 14, 2025
మహిళామణులకు స్వాతంత్య్ర కానుక
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం.
పల్లెవెలుగు,ఆల్ట్ర పల్లెవెలుగు,సిటీ బస్, సిటీ మెట్రో,ఎక్స్‌ప్రెస్ సర్వీసులలో ఉచిత ప్రయాణ సౌకర్యం.#sthreeshakti#FreeBusTravelForWomen#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#Apdcpic.twitter.com/3ggiBTz2gU
ఈ బస్సులోనే అవకాశం..
ఏపీ ఉచిత బస్సు పథకం బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లకు మాత్రమే వర్తిస్తుంది. అయితే అన్ని బస్సుల్లో మహిళలు ప్రయాణించడానికి కుదరదు. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్‌లో ఏపీకి గుర్తింపు పొందిన కార్డు చూపించి ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించవచ్చని కూటమి ప్రభుత్వం తెలిపింది.
ఏయే బస్సులో వర్తించదు
నాన్ ఏసీ స్లీపర్ స్టార్ లైనర్, సూపర్ లగ్జరీ, ఆల్ట్రా డీలక్స్ బస్సులో అసలు సౌకర్యం ఉండదు. ముఖ్యంగా తిరుమల, తిరుపతి మధ్య సప్తగిరి బస్సులో అసలు ఉచిత ప్రయాణం వర్తించదు. అలాగే నాన్ స్టాప్, వేరే రాష్ట్రాల మధ్య తిరిగే అంతర్రాష్ట బస్సులు, చార్టర్డ్, ప్యాకేజ్ టూర్ సర్వీసుల్లో కూడా మహిళలు ఉచిత ప్రయాణం చేయడానికి కుదరదు.
ఈ గుర్తింపు కార్డు ఉంటేనే..
స్త్రీ శక్తి పథకం కింద మహిళలు ఉచిత ప్రయాణం చేయాలంటే తప్పకుండా కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గుర్తుంపు కార్డు చూపించాలి. ఆధారు కార్డు, ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు వంటివి చూపించాలి. అలాగే అప్‌డేటెడ్ ఆధార్ ఉండాలని కూటమి ప్రభుత్వం తెలిపింది.
ఇది కూడా చూడండి: YCPకి దెబ్బ మీద దెబ్బ.. పులివెందుల ZPTC ఎన్నికపై హైకోర్టు సంచలన తీర్పు!