కళ్యాణదుర్గంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం-LIVE
కళ్యాణదుర్గంలో ఈ రోజు సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
కళ్యాణదుర్గంలో ఈ రోజు సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
AP: పుట్టపర్తిలో సీఐ రాగిరి రామయ్య మండల మెజిస్ట్రేట్ వేణుగోపాల్‌తో దురుసుగా ప్రవర్తించారు. ఆయనపై మాటల దాడికి దిగారు. పోలింగ్ ఎక్కువ అవుతున్న తరుణంలో సహనం కోల్పోయి సీఐ ఈ విధంగా వ్యవహరించారని పోలింగ్ సిబ్బంది తెలిపారు.
అనంతపురం లోక్ సభలో టీడీపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణ, వైసీపీ అభ్యర్థిగా శంకర నారాయణ తలపడుతున్నారు. ఇక్కడ ఎవరు గెలుస్తారు? అన్న అంశంపై ఆర్టీవీ స్టడీలో ఏం తేలిందో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ ను చదవండి.
ఏపీలోని సత్యసాయి జిల్లాలో వాహనాలు తనిఖీ చేస్తున్న ఇద్దరు పోలీసులు ఒకరినొకరు కొట్టుకున్నారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే బూతులు తిట్టుకుంటూ పోట్లాడుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
నిన్న ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేసిన ఈసీ.. తాజాగా మరో కీలక అధికారిపై చర్యలు తీసుకుంది. అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిని బదిలీ చేసింది. ఎన్నికలు ముగిసే వరకు ఆయనకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వొద్దని సీఎస్ కు ఆదేశాలు జారీ చేసింది.
పోస్టల బ్యాలెట్ ఓట్లను అమ్ముకుంటున్నారంటూ కల్యాణదుర్గంలో టీడీపీ నేతల ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నేతలు ఆర్డీఓ ఆఫీస్ దగ్గరే ఉద్యోగులకు డబ్బులు ఇస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఏపీలో ధర్మవరంలో కూటమి అభ్యర్థుల తరపున కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి.. అమరావతి రాజధాని వంటి హామీలను అమిత్ షా ఇచ్చారు.
అనంతపురం జిల్లా లోని ఇద్దరు డీఎస్పీల పై ఎలక్షన్ సంఘం చర్యలు చేపట్టింది.అనంతపురం టౌన్ డీఎస్పీ వీరరాఘవరెడ్డి, రాయచోటి డీఎస్పీ సయ్యద్ మహబూబ్ బాషాలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.