ఏపీలో నిన్న జరిగిన ఎన్నికల సందర్భంగా మొదలైన మంటలు ఇంకా చల్లారలేదు. అనేక ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇంకా అల్లర్లు ఆగలేదు. తాజాగా టీడీపీ నేత సూర్యముని ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారెడ్డి, అనుచరులు రాళ్ల దాడి చేశారు. వందలాది మందిగా వెళ్లిన వైసీపీ శ్రేణులు దాడి చేశారు. అనంతరం పెద్దారెడ్డి ఇంటి ముట్టడికి టీడీపీ శ్రేణులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. స్మోక్ బాంబులతో పోలీసులు చెదరగొట్టారు.
AP Elections 2024: తాడిపత్రి రణరంగం.. రాళ్ల దాడి, స్మోక్ బాంబ్!
తాడిపత్రిలో మళ్లీ లొల్లి మొదలైంది. టీడీపీ నేత సూర్యముని ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఇందుకు కౌంటర్ గా ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై దాడికి టీడీపీ శ్రేణులు యత్నించాయి. వీరిని అడ్డుకున్న పోలీసులు స్మోక్ బాంబ్ ప్రయోగించారు.
Translate this News: