3 తుపాన్ల ముప్పు.. ఏపీలో మరో మూడు రోజుల్లో భారీ వర్షాలు!
ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణశాఖ కేంద్రం పేర్కొంది. ఈ నెలలో అరేబియా సముద్రంలో 1, బంగాళాఖాతంలో 2 తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు
ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణశాఖ కేంద్రం పేర్కొంది. ఈ నెలలో అరేబియా సముద్రంలో 1, బంగాళాఖాతంలో 2 తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 'వైఎస్సార్ జిల్లా' పేరును మార్చాలంటూ సీఎం చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్ లేఖ రాశారు. వైఎస్సార్ జిల్లా పేరును "వైఎస్సార్ కడప" జిల్లాగా మార్చాలని ఆయన కోరారు.
ఏపీ టెన్త్ విద్యార్థులకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఎన్సీఆర్టీ పుస్తకాల్లోని హిందీ పాఠాలు కష్టంగా ఉండటంతో పదవ తరగతిలో నాలుగు పాఠాలను తొలగిస్తున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శులు, వాలంటీర్లుకు కూటమి ప్రభుత్వం షాకిచ్చింది. గత ప్రభుత్వం వార్తాపత్రికల కోసమని కేటాయించిన రూ.200 అలవెన్సును ప్రభుత్వం రద్దు చేసింది.
AP: గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట రెడ్డికి మూడు రోజల కస్టడీ విధించింది విజయవాడ ఏసీబీ కోర్టు. వెంకటరెడ్డి చర్యల వల్ల రూ. 2,566 కోట్ల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని గుర్తించిన ఏసీబీ అధికారులు.. ఇటీవల అతన్ని అరెస్ట్ చేశారు.
ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీకి నేటినుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అక్టోబర్ 9వరకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అక్టోబర్ 11న లాటరీ తీసి, లైసెన్సులు కేటాయించనున్నారు. రూ.99కే క్వార్టర్ మద్యం లభించనుంది.
పిడుగుపాటుతో భార్యాభర్తలలు ప్రాణాలు కోల్పోయిన ఘటన అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం దిగువగంగంపల్లి తండాలో చోటుచేసుకుంది. పొలంలో పని చేస్తుండగా పిడుగు పడడంతో దసరా నాయక్ (51), దేవీబాయి (46) దంపతులతో పాటు వారి రెండు ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి.
AP: అనంతపురం కనేకల్ మండలం హనకనహాల్లో కొందరు దుండగులు రామాలయ రథానికి నిప్పు అంటించారు. గమనించిన స్థానికులు మంటలు ఆర్పారు. రాష్ట్రంలో లడ్డూ వివాదం నడుస్తున్న వేళ ఈ ఘటన జరగడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టితోంది.
ఏపీ ధర్మవరంలో బీజేపీ, వైసీపీ కర్యకర్తల మధ్య పరస్పర వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన అనుచరులను పరామర్శించేందుకు వెళ్లగా జనసేన-టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పోలీసులు ఇరువురిని శాంతింపజేశారు.