ధర్మవరంలో హై టెన్షన్‌.. వైసీపీ-బీజేపీ మధ్య ఘర్షణ

ఏపీ ధర్మవరంలో బీజేపీ, వైసీపీ కర్యకర్తల మధ్య పరస్పర వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన అనుచరులను పరామర్శించేందుకు వెళ్లగా జనసేన-టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పోలీసులు ఇరువురిని శాంతింపజేశారు.

New Update
Dharmavaram

AP News: ధర్మవరం పట్టణ కేంద్రంలో వైసీపీ నాయకులకు బీజేపీ కూటమి నాయకులకు మధ్య పరస్పర వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన అనుచరులను పరామర్శించేందుకు ధర్మవరం పట్టణంలోని సబ్ జైలుకు బయల్దేరిన్నారు. ఈ క్రమంలో కేతిరెడ్డికి సంబంధించిన వాహనాలు రహదారిపై నిలిచి ఉండగా బీజేపీ నాయకులు హరీష్ తన కార్యకర్తలతో కలిసి అదే దారిలో ప్రయాణిస్తున్నారు. దానికి అడ్డంగా ఉన్న కేతిరెడ్డి వాహనాలను ముందుకు తీసుకెళ్లాలని హార్న్ కొట్టాడు. దీంతో కేతిరెడ్డి వాహనంలోనే ఉన్న డ్రైవర్ బీజేపీ నాయకులను మాటలతో దూషించారు.  

వెంటనే బీజేపీ నాయకులు కేతిరెడ్డి వాహనాల ముందు రోడ్డుపై బైఠాయించారు. ఆ వెంటనే అక్కడికి చేరుకున్న జనసేన-టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య పరస్పరం వాదనలు పెరగగా కాసేపు ప్రధాన రహదారులపై తోపులాట జరిగింది. వెంటనే అక్కడికి చేరుకున్న ధర్మవరం పట్టణ పోలీసులు ఇరు వర్గాలకు సర్థి చెప్పి సమస్యను సర్దుమణిగించారు. ఈ ఘర్షణలో ఓ వ్యక్తికి స్వల్ప గాయాలైనట్టు వైసీపీ నాయకులు తెలిపారు.

 

Advertisment
Advertisment
తాజా కథనాలు