/rtv/media/media_files/2025/04/28/UoUhxLl7c5LghLYssg2G.jpg)
Congress leader madar
AP Crime: అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం చోటు చేసుకుంది. దళిత నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు చిప్పగిరి లక్ష్మీనారాయణ (58) దారుణంగా హత్యకు గురయ్యారు. ఆయన కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడిగా పనిచేస్తున్నారు. ఆదివారం సన్నిహితులతో కలిసి గుంతకల్లు వెళ్తుండగా గుంతకల్లు శివారులో కాపు కాచిన దుండగులు ఆయన వాహనాన్ని టిప్పర్‌తో ఢీకొట్టారు. తరువాత మారణాయుధాలతో దాడి చేసి చిప్పగిరి లక్ష్మీనారాయణను దారుణంగా హత్య చేశారు.
హత్యకు పాత కక్షలు కారణమని..
ఈ ఘటనలో ఆయన కుమారుడు వినోద్, సోదరుడి కుమారుడు గోవిందు కూడా వాహనంలో ఉన్నారు. కారులో చిక్కుకున్నవారిని స్థానికులు వెలికితీశారు. ఈ హత్యకు పాత కక్షలు కారణమని పోలీసులు భావిస్తున్నారు గతంలో కూడా ఈ ప్రాంతంలో చిప్పగిరికి చెందిన వైకుంఠం ప్రభాకర్ చౌదరి, వైకుంఠం వెంకటేశ్‌చౌదరి హత్యలు జరిగాయి. అదే మండలం ఏరూరుకు చెందిన మూస దారుణ హత్యకు గురయ్యాడు. చిప్పగిరి లక్ష్మీనారాయణ ఇంటి వద్ద ఉన్న పోలీస్ పికెట్‌ను పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య ఎత్తేసినట్లు మృతుడి సోదరుడి కుమారుడు గోవిందు ఆరోపించారు. ఆయనకు ఎప్పటినుంచో ప్రాణహాని ఉందని, హోంమంత్రి, కర్నూలు జిల్లా ఎస్పీకి అర్జీ పెట్టినట్లు కూడా ఆయన పేర్కొన్నారు.
ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చిప్పగిరి లక్ష్మీనారాయణ గారి హత్య తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. లారితో ఢీ కొట్టి,వేట కొడవళ్ళతో నరికి చంపడం అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం అవుతుంది. ఈ ఘటనపై పోలీసు శాఖ అత్యున్నత విచారణ జరిపించాలి. నిందితులకు… pic.twitter.com/0SSI6UpjKe
— YS Sharmila (@realyssharmila) April 27, 2025
అయితే డీఎస్పీ వెంకట్రామయ్య ఈ ఆరోపణలను అవాస్తవంగా పేర్కొన్నారు. 2006లో కూడా చిప్పగిరిలో కర్నూలు సహకార బ్యాంకు అధ్యక్షుడు వైకుంఠం శ్రీరాములు, ఆయన భార్య శకుంతలమ్మ హత్యకు గురయ్యారు. ఈ హత్యలో లక్ష్మీనారాయణ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు, కానీ కోర్టులో అది వీగిపోయింది. అప్పటి నుంచి ఆయన ఇంటి వద్ద ఇద్దరు కానిస్టేబుళ్లతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఈ హత్యపై అత్యున్నత స్థాయి విచారణ జరిపించాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో ఈ ఘటన ద్వారా అర్థమవుతోందని విమర్శించారు.
ఇది కూడా చదవండి: వేసవిలో తలనొప్పి తగ్గించే ఇంటి చిట్కాలు
( AP Crime | ap crime latest updates | ap crime updates | ap-crime-news | ap-crime-report | latest-news )