ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ పెన్షన్ దారులకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఇక నుంచి దేశంలో ఎక్కడి నుంచి అయినా, ఏ బ్యాంకు నుంచి అయిన కూడా డబ్బులు తీసుకోవచ్చని కేంద్రం తెలిపింది. సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్‌ను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. గతంలోనే దీన్ని ప్రతిపాదించారు. కానీ పూర్తి స్థాయిలో ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చారు.
ఇది కూడా చూడండి: Dehydration: చలికాలంలో తక్కువ నీరు తాగుతున్నారా..? డీహైడ్రేషన్ లక్షణాలు ఇవే
Retirement fund body #EPFO has completed the Centralized #Pension Payments System (CPPS) rollout in all its regional offices across the country that will benefit over 68 lakh pensioners, the labour ministry said on Friday.https://t.co/y9PpItjpfK pic.twitter.com/VvoxBu6P6Y
— Business Standard (@bsindia) January 3, 2025
ఇది కూడా చూడండి: Telangana: విపరీతంగా పెరుగుతున్న చలి తీవ్రత..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
దాదాపుగా 78 లక్షల పెన్షన్ దారులకు..
ఈపీఎఫ్‌ఓ ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల దాదాపుగా 78 లక్షల పెన్షన్ దారులకు ప్రయోజనం ఉంటుంది. గత ఎన్నో ఏళ్ల నుంచి ఈపీఎఫ్‌ఓ పెన్షన్ దారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక ఈ నిర్ణయంతో ఆ సమస్యలన్నింటికి కూడా పరిష్కారం దొరికిందని చెప్పవచ్చు. ఏ బ్యాంకు వాళ్లు అయిన కూడా ఇతర బ్యాంకుల నుంచి డబ్బులను తీసుకోవచ్చు. పింఛను దారులు ప్రదేశాలు మారితే ఇది బాగా ఉపయోగపడుతుంది. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్లినప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. గతంలో ఈపీఎఫ్ఓ జోనల్ లేదా ప్రాంతీయ కార్యాలయాలు కేవలం 3-4 బ్యాంకులతో మాత్రమే ఉన్నాయి. అదే ఇకపై సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఇది కూడా చూడండి: Cricket: 96 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా