తెలుగు యువతి మరణం మీద అమెరికా పోలీస్ చులకన వ్యాఖ్యలు

అమెరికాలో మరణించిన తెలుగు యువతి మీద అక్కడి పోలీస్ అధికారి ఒకరు చులకనగా మాట్లాడారు. చచ్చిపోయింది మామూలు వ్యక్తే...ఏదొ కొంత డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుంది అంటూ హేళన చేశారు. దీని మీద భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

తెలుగు యువతి మరణం మీద అమెరికా పోలీస్ చులకన వ్యాఖ్యలు
New Update

అమెరికా పోలీస్ మాటలు కలకలం రేపుతున్నాయి. ఒక బాధ్యత కలిగిన ఉద్యోగం చేస్తూ అలా ఎలా మాట్లాడతారంటూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అమెరికాలోని సియాటెల్ లో నార్త్ ఈస్టర్స్ లో చదువుతున్న కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన యువతి జాహ్నవి రోడ్డు ప్రమాదంలో మరణించింది. అది కూడా పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టి. దాన్ని దర్యాప్తు చేయడానికి వచ్చిన పోలీస్ అధికారి డానియెల్ అడరర్....ఋ మరణం వివరాలు పై అదికారులకు చెబుతూ చాలా చులకనగా మాట్లాడారు. ఇదంతా అతని బాడీకి ఉన్న కెమెరాలో రికార్డ్ అయ్యాయి. తాజాగా ఆ రికార్డ్స్ బయటపడడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఏమన్నాడంటే...
ఆమె చ్చిపోయింది...మామూలు వ్యక్తేలే. స్త్రముంది ఓ పదకొండు వేల డాలర్ల చెక్కు రాస్తే చాలు. ఆమెకు 26 ఏళ్ళు ఉంటాయేమో...విలువ తక్కువే అంటూ పగలబడి నవ్వుతూ మాట్లాడాడు డానియెల్ అడరర్. అంతేకాదు జాహ్నవిని ఢీకొట్టిన పోలీస్ ఆఫీసర్ కెవిన్ ను కాపాడ్డానికి కూడా ట్రై చేశాడు. ఆమెను ఢీకొట్టినప్పుడు కెవిన్ గంటకు 50 మైళ్ళ వేగంతో కారు పడుపుతున్నాడని...అది చాలా తక్కువ వేగమేనని, పైగా కారు కూడా అదుపు తప్పలేదని దర్యాప్తులో పేర్కొన్నాడు డానియెల్. తప్పు జాహ్నవిదే అన్నట్టు చూపించడానికి ప్రయత్నించాడు. కానీ కెవిన్ కారు 74 మైళ్ళ వేగంతో వెళుతోందని...కారు అదుపు తప్పిందని ఫోర్సెనిక్, ఇతర దర్యాప్తుల్లో తేలింది.

American police comments and laughing on the death of a young Telugu woman

ఈ మొత్తం వ్యవమారంపై భారత ప్రభుత్వం సీరియెస్ అయింది. ఈ ఉదంతపై లోతైన దర్యాప్తు జరపాలని శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ డిమాండ్ చేసింది. మనిషి మరణంపై చులనకగా మాట్లాడడం సరికాదని మండిపడింది. ఈ అంశంపై అమెరికా ఉన్నతాధికారుల ఫిర్యాదు చేశామని ట్వీట్ చేసింది.

https://x.com/CGISFO/status/1701961203935830315?s=20

#police #accident #girl #comments #usa #death #telugu #america #record #young #cheap #cop #tape
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe