Israel Hamas War: హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సైన్యం మధ్య ఎడతెగకుండా కాల్పులు జరుగుతున్నాయి. ఇజ్రాయల్లోకి చొచ్చుకుని వచ్చిన మిలిటెంట్లతో అక్కడ వీధుల్లోనే జవాన్లు పోరాడుతున్నారు. మరోవైపు హమాస్ చర్యలకు ప్రతీకారంగా గాజా మీదమీద ఇజ్రాయెల్ రాకెట్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా తూర్పు మధ్యధరా సముద్ర ప్రాంతానికి విమాన వాహక నౌకను పంపాలని అమెరికా (America) నిర్ణయించుకుంది. దాంతో పాటూ ఫోర్డ్ క్యారియర్ స్ట్రేక్ గ్రూప్ (ford carrier strike group) కూడా అక్కడకు వెళ్ళనుంది. ఈ విషయాన్ని అమెరికా అధికారులు స్వయంగా ధృవీకరించారు. 5వేల నావికులు, యుద్ధ విమానాలతో కూడిన ద యూఎస్ఎస్ గెరాల్డ్ (USS Gerald) ఆఫ్ పోర్డ్ వాహక నౌక, క్రూజ్, డిస్ట్రాయర్స్‌లను అమెరికా పంపనుంది.
ఈ నౌకతో ఇజ్రాయెల్ (Israel)కు అదనపు బలం చేకూరుతుంది. ఇది ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడంతో పాటూ హమాస్ (Hamas)కు అదనపు ఆయుధాలను సమకూర్చే వారిమీద నిఘా ఉంచుతుంది. ఇందులో యూఎస్ఎస్ నార్మండి, డిస్ట్రాయర్లు, యూఎస్ఎస్ థామస్ హడ్నర్, యూఎస్ఎస్ రాంపేజ్, యూఎస్ఎస్ క్యార్నీ, యూఎస్ఎస్ రూజ్‌వెల్ట్‌తో పాటూ ఎఫ్ 35, ఎఫ్16, ఏ10 యుద్ధ విమానాలు ఉంటాయి. అయితే ఇజ్రాయెల్‌లకు అమెనికా మద్దతు ఇవ్వడం మీద టర్కీ (Turkey) మండిపడుతోంది. మా విషయాలలో అనవసరంగా తలదూర్చవద్దని హెచ్చరించింది. వద్దన్నా తలదూరిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కొనక తప్పదని వార్నింగ్ ఇచ్చింది.
ఇక ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల యుద్ధంలో ఇప్పటివరకు 1100 మంది మరణించారు. ఇజ్రాయెల్‌లో 700 మందికి పైగా చనిపోయారు. గాజాలో 400 మంది మరణించారని అంచనా వేస్తున్నారు. రెండువైపులా కలిసి 2000కు పైగా గాయపడినవారు ఉన్నారు. మరోవైపు 400 మంది హమాస్ మిలిటెంట్లను ఇజ్రాయెల్ సైన్యం అంతమొందించిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. అలాగే చాలా మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.
అలాగే హమాస్ మిలిటెంట్లు కూడా చాలా మంది ఇజ్రెల్ పౌరులను అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. వీరందరినీ గాజాకు తరలించినట్లు సమాచారం.వీరిలో ఎక్కువుగా ముసలివాళ్ళు, ఆడవారు, పిల్లలు ఉన్నారు. వీరిని అడ్డం పెట్టుకుని ఇజ్రాయెల్ ఖైదులో ఉన్న పాలస్తీనా వాసులను విడిపించుకోవాలని ఆ దేశం భావిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ ఈ లోపు హమాస్ మిలిటెంట్ల చేతుల్లో ఆడవాళ్ళు అత్యాచారాలకు గురవుతున్నట్లు సమాచారం అందుతోంది.
ఇజ్రాయెల్, గాజా (Gaza)ల్లో ఉన్న భారతీయులు అందరూ మాత్రం క్షేమంగా ఉన్నారని చెబుతన్నారు. అక్కడి భారత రాయబారులు. అక్కడ దాదాపు 18వేల మంది భారతీయులు ఉన్నారు. వారితో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని, ఏం చేయాలో చెబుతున్నామని రాయబార కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. కానీ అక్కడి భారతీయులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఇంటర్నెట్, కరెంట్ నిలిచిపోయాయి. ఇండియా నుంచి టెల్ అవిన్‌కు ఎయిర్ ఇండియా ఈ నెల14 వరకు విమాన సర్వీసులను నిలిపేసింది.
Also Read: ఎదురుతిరగడంతో యువతిని కాల్చిన కిరాతకులు..ఇజ్రాయెల్‌లో ఇంత దారుణమా..!(వీడియో)