భూతల దాడులు మరింత ఉధృతం..ఇజ్రాయెల్ ప్రధానికి జో బైడెన్ ఫోన్..ఇలా చేయాలంటూ సూచన.!
హమాస్ ఉగ్రవాదుల స్థావరాలను..ఇజ్రాయెల్ నామరూపాల్లేకుండా చేస్తోంది. భూతల దాడులను మరింత ఉధృతం చేసింది. 24 గంటల వ్యవధిలో 450 హమాస్ స్థావరాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం ప్రకటించింది. ఇదిలా ఉండగా..అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహుకు ఫోన్ చేసి మాట్లాడారు. హమాస్ మిలిటెంట్లు, పౌరుల మధ్య తేడాను గుర్తించాలని కోరారు. ఇజ్రాయెల్‌కు ఆత్మ రక్షణ హక్కు ఉన్నప్పటికీ సామాన్యులకు రక్షణ కల్పించాల్సిన అవసరం కూడా ఉందన్నారు.