Hyderabad: హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనం చేయొద్దు.. హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనం చేయొద్దని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలనే అమలు చేయాలని పిటిషనర్‌ కోరారు. ఇందుకు హైడ్రాను కూడా ప్రతివాదిగా చేర్చాలన్నారు.

Hyderabad: హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనం చేయొద్దు.. హైకోర్టులో పిటిషన్
New Update

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినాయక చవితి హవా నడుస్తోంది. 9 రోజులకి గణనాథుడు గంగమ్మ ఒడికి చేరనున్నారు. అయితే హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనం చేయొద్దని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలనే అమలు చేయాలని పిటిషనర్‌ కోరారు. అలాగే సాగర్ పరిరక్షించే బాధ్యత హైడ్రాకు ఉంది కాబట్టి.. హైడ్రాను ప్రతివాదిగా చేర్చాలని అభ్యర్థించారు.

Also Read: మొన్న తుంగభద్ర, నేడు ప్రకాశం బ్యారేజ్ గేట్ల రిపేర్.. ఎవరీ కన్నయ్య నాయుడు?

దీంతో చీఫ్‌ జస్టిస్ ధర్మాసనం పిటిషన్‌ను మరో బెంచ్‌కు బదిలీ చేసింది. ఈ అంశంపై మంగళవారం జస్టిస్ వినోద్‌ కుమార్‌ ధర్మాసనం విచారణ జరపనుంది. మరీ న్యాయస్థానం ఈసారి హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయడానికి పర్మిషన్ ఇస్తుందా లేదా అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇదిలాఉండగా ప్రస్తుతం పర్యవరణాన్ని కాపాడటమే లక్ష్యంగా హైదరాబాద్‌లో హైడ్రా అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే రేవంత్‌ ప్రభుత్వం కూడా ముసీనదిని సుందరీకరిస్తామని ఇటీవల ప్రకటన చేసింది. మరీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి పర్మిషన్ వస్తుందా ? లేదా? తెలియాలంటే కోర్టు తీర్పు వరకు వేచిచూడాల్సిందే.

#telugu-news #telangana #hyderabad #hydra #vinayaka-chavithi #hussain-sagar #tankbund
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe