Andhra Pradesh : ఏపీలో దారుణం.. వేటకొడవళ్లతో టీడీపీ కార్యకర్త హత్య

ఏపీలో టీడీపీ కార్యకర్తను వైసీపీ కార్యకర్తలు వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపడం కలకలం రేపింది. సమాచారం మేరకు జిల్లా ఎస్పీ శ్రీకాంత్ ఘటనాస్థలానికి వచ్చి పరిశీలించారు. గ్రామంలో అల్లర్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఐ సురేష్ కుమార్, ఎస్‌ఐ చంద్రశేఖర్‌ రెడ్డిలకు ఆదేశించారు.

Andhra Pradesh : ఏపీలో దారుణం.. వేటకొడవళ్లతో టీడీపీ కార్యకర్త హత్య
New Update

TDP Worker Murder : ఏపీ (Andhra Pradesh) లో టీడీపీ (TDP) కార్యకర్తను వైసీపీ (YCP) కార్యకర్తలు వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపడం కలకలం రేపింది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లెలో ఆదివారం సాయంత్రం ఈ విషాద ఘటన జరిగింది. గ్రామానికి చెందిన మోదుపల్లి రామాంజనేయులు కుమారులు గిరినాథ్ చౌదరి, కళ్యాణ్ చక్రవర్తిలు గ్రామంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ సమయంలోనే వైసీపీ కార్యకర్తలు వీళ్లతో గొడవలకు దిగారు. టీడీపీ గెలిస్తే ఏం చేయగలదంటూ వారితో వాదించారు. చివరికి పక్కనే పొలంలో గడ్డివాము వద్ద ఉన్న వేటకొడవల్లతో గిరినాథ్ చౌదరి, కళ్యాణ్ చక్రవర్తిలపై దాడికి దిగారు (Brutal Murder).

Also Read: తనకు ఏ పదవి కావాలో చెప్పేసిన పవన్ కల్యాణ్..!

తలపై వేటకొడవల్ల వేటు పడి గిరినాథ్ చౌదరి అక్కడిక్కడే మృతి చెందారు. కళ్యాణ్ చక్రవర్తికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. అయితే మోదుపల్లి రామాంజనేయులు టీడీపీ జిల్లా కార్యదర్శి మోదుపల్లి సుబ్బరాయుడు అన్నదమ్ములు. సుబ్బరాయుడు భార్య శైలజ గతంలో ఎంపీపీగా కూడా పనిచేశారు. అయితే వీళ్లు వైసీపీకి దీటుదా టీడీపీని నడిపిస్తుండటమే విభేదాలకు కారణమని గ్రామస్థులు చెబుతున్నారు.

అయితే హత్య జరిగిన అనంతం సమాచారం మేరకు జిల్లా ఎస్పీ శ్రీకాంత్ ఘటనాస్థలానికి వచ్చి పరిశీలించారు. గ్రామంలో అల్లర్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఐ సురేష్ కుమార్, ఎస్‌ఐ చంద్రశేఖర్‌ రెడ్డిలకు ఆదేశాలు జారీ చేశారు. హత్య విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు వందలాదిమంది వెల్దుర్తి ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. మరోవైపు వైసీపీ నాయకుల గడ్డివాములకు కొందరు టీడీపీ నాయకులు నిప్పు పెట్టారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేశారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ గ్రామంలో బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.

Also Read: వైసీపీ గెలుస్తుందని రూ.30 కోట్ల బెట్టింగ్ పెట్టాడు.. చివరికి

#brutal-murder #tdp #telugu-news #ysrcp #crime
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి