Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా (Deputy CM) బాధ్యతలు చేపట్టేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంసిద్ధత వ్యక్తం చేశారని ఓ జాతీయ మీడియా ఆదివారం వెల్లడించింది. ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రమాణస్వీకారోత్సవానికి పవన్ కల్యాణ్.. తన సతిమణితో కలిసి హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భానే ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. అయితే రిపోర్టర్ ప్రశ్నలు, ఆయన వ్యాఖ్యానం అస్పష్టంగా ఉండటంతో పవన్ ఏం మాట్లాడారు అనేది సరిగా వినపడలేదు. అనంతరం ఆ రిపోర్టర్.. పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Pawan Kalyan: తనకు ఏ పదవి కావాలో చెప్పేసిన పవన్ కల్యాణ్..!
డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంసిద్ధత వ్యక్తం చేశారని ఓ జాతీయ మీడియా ఆదివారం వెల్లడించింది. పవన్ చెప్పిన విషయంపై ఆ ఛానల్లో కొంతసేపు స్క్రోలింగ్ ప్రసారం చేశారు. జనసేన అధినేత ఏపీలో డిప్యూటీ సీఎం పదవి ఆశిస్తున్నారని అందులో పేర్కొన్నారు.
Translate this News: