Floods: వరదల్లో చిక్కుకున్న బ్రెజిల్.. 78 మంది మృతి

గత కొన్నిరోజులుగా బ్రెజిల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదల ధాటికి ఇప్పటివరకు 78 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 105 మంది గల్లంతైనట్లు స్థానిక మీడియా తెలిపింది. సుమారు లక్ష మందికి పైగా నిరాశ్రయులయ్యారు.

New Update
Floods: వరదల్లో చిక్కుకున్న బ్రెజిల్.. 78 మంది మృతి

గత కొన్నిరోజులుగా బ్రెజిల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదల ధాటికి జనజీవనం స్థంభించిపోయింది. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 78 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 105 మంది గల్లంతైనట్లు స్థానిక మీడియా తెలిపింది. సుమారు లక్ష మందికి పైగా నిరాశ్రయులైనట్లు చెప్పింది. ఉరుగ్వే, అర్జెంటీనాకు సరిహద్దున ఉన్న రాష్ట్రంలోని 500 నగరాల్లో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మందిని ఈ వరుదలు ప్రాభావితం చేశాయని పేర్కొంది.

Also Read: వరల్డ్ కప్‌ టోర్నీకి ఉగ్ర ముప్పు.. ఆ దేశం నుంచి బెదిరింపులు!

మరోవైపు ఈ భారీ వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. పలు నగరాల్లో రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. అనేక చోట్ల విద్యుత్, తాగునీరు, సమాచారా వ్యవస్థ నిలిచిపోయింది. దాదాపు 4 లక్షల మందికి పైగా ప్రజలు చీకట్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో బ్రెజిల్ ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతోంది. అంతేకాదు ఆ దేశ సైన్యం కూడా రంగంలోకి దిగింది.

Also Read: కోవిషీల్డ్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌.. విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు

Advertisment
Advertisment
తాజా కథనాలు