Brazil Floods: బ్రెజిల్లో 100 మంది మృతి.. లక్ష ఇళ్లు ధ్వంసం
బ్రెజిల్లో సంభవించిన వరదల బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. వీటి ప్రభావం వల్ల ఇప్పటివరకు 100 మందికి పైగా మృతి చెందారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దాదాపు లక్ష ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను రక్షించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.