Chandrababu cases:బెయిలా... జైలా?6 కేసులు, 5 తీర్పులు.

ఆంధ్రప్రదేశ్ అంతటా తీవ్ర ఉత్కంఠత నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈరోజు కీలకం కానుంది. విజయవాడ హైకోర్టులో, అటు సుప్రీంకోర్టులో కూడా ఈరోజు తీర్పులు వెలువడనున్నాయి. దీంతో చంద్రబాబకు బెయిల్ వస్తుందా? లేదా అన్న ఉత్కంఠతకు నేటితో తెరపడనుంది.

New Update
Chandrababu cases:బెయిలా... జైలా?6 కేసులు, 5 తీర్పులు.

ఇన్నర్ రింగ్ రోడ్డు,ఫైబర్ నెట్,అంగళ్ళు కేసుల్లో చంద్రబాబు బెయిల్ పిటిషన్ మీద అమరావతి హైకోర్టు లో నేడు తీర్పు రానుంది. అలాగే విజయవాడ ఎసిబి స్పెషల్ కోర్టు లో కస్టడీ, బెయిల్ పిటిషన్ల మీద కూడా ఈరోజే తీర్పు చెప్పనున్నారు. ఇక క్వాష్ పిటీషన్ పై కూడా సుప్రీంకోర్టు కూడా ఇవాళే తీర్పు వెలువరించనుంది. దీంతో చంద్రబాబుకు ఈరోజు చాలా కీలకంల మారింది. ఆయనకు బెయిల్ వస్తుందా? రాదా అనే విషయంలో ఉత్కంఠత నెలకొంది.

దిగువ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు నేడు విచారణలు, తీర్పులు జరగనున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌పై ఈరోజు విచారణ ఉంది. ఇదే కేసులో తనకు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు వేసిన పిటిషన్‌ మీద విజయవాడలోని ఏసీబీ కోర్టు కూడా నేడే నిర్ణయాన్ని వెల్లడించనుంది. దీంతోపాటు మరోసారి 'పోలీసు కస్టడీ'కి కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌పై సైతం ఇవాళే ఏసీబీ కోర్టు తగిన ఉత్తర్వులు జారీచేయనుంది. ఈ రెండు పిటిషన్ల మీదా శుక్రవారమే ఏసీబీ కోర్టులో వాదనలు ముగిసాయి. అయితే తీర్పును మాత్రం సోమవారానికి వాయిదా వేశారు.

హైకోర్టులోనూ చంద్రబాబుకు సంబంధించిన మూడు బెయిలు పిటిషన్లపై ఈరోజు తీర్పులు వెల్లడికానున్నాయి. రాజధాని అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అంగళ్లు, ఫైబర్‌ నెట్‌ కేసుల్లో బెయిలు కోసం చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై ఇటీవల వాదనలు ముగియడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డి తీర్పులను రిజర్వు చేసిన సంగతి తెలిసిందే. ఈ మూడు పిటిషన్లలో న్యాయమూర్తి నిర్ణయం వెల్లడించనున్నారు.

ఇక సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు మీద ఉన్న కేసును కొట్టేయాలంటూ ఆయన తరుఫు లాయర్లు క్వాష్ పిటిషన్ వేశారు. దీని మీద ఈరోజు అత్యన్నత న్యాయస్థానం తీర్పును ఇవ్వనుంది. ఈ కేసు సుప్రీంకోర్టులో 59వ ఐటెమ్ గా లిస్ట్ అయింది. జస్టిస్ అనిపుధ్ బోస్, జస్టిస్ బేలా. ఎమ్.త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారణ చేయనుంది. చంద్రబాబు తరుపున సీనియర్ లాయర్లు హరీష్ సాల్వే, అభిషేక్ మను సింఘ్వి,సిద్ధార్ధ లూథ్రా వఆదనలు వినిపించనున్నారు. ఏపీ ప్రభుత్వం తరుపున ముకుల్ రోహ్గతి వాదనలు వినిపిస్తారు. ముందస్తు అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం న్యాయం కాదని ఆయన తరుపు లాయర్లు వాదించారు. సెక్షన్ 17ఏ ప్రకారం అరెస్ట్ కు గవర్నర్ అనుమతి తప్పనిసరి అని కోర్టుకు తెలిపారు. అందుకే బాబు మీద ఉన్న ఎఫ్ఐఆర్ కొట్టేయాలని, జ్యూడీషియల్ రిమాండ్ రద్దు చేయాలని కోర్టును కోరారు.

చంద్రబాబు మీద ఉన్న అన్ని కేసుల్లో దాదాపు ఈరోజే తీర్పు రానుండడంతో ఆంధ్రప్రదేశ్ అంతటా, టీడీపీ శ్రేణుల్లో త్రీవ ఉత్కంఠత నెలకొంది. చంద్రబాబు అరెస్ట్ అయి కరెక్ట్ గా ఈరోజుతో నెల రోజులు పూర్తయ్యాయి.

Also Read:నేడే తెలంగాణ ఎన్నికల షెడ్యూల్.. ఈసీ అధికారిక ప్రకటన!

Advertisment
తాజా కథనాలు