Big Breaking: నేడే తెలంగాణ ఎన్నికల షెడ్యూల్.. ఈసీ అధికారిక ప్రకటన! ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల నగారా...మోగనుంది. ఐదు రాష్ట్రాల (తెలంగాణ, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ,మిజోరాం)అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను భారత ఎన్నికల కమిషన్..ప్రకటించనుంది. By Bhoomi 09 Oct 2023 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Telangana Assembly Elections Schedule 2023: నేడే తెలంగాణ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల నగారా...మోగనుంది. ఐదు రాష్ట్రాల (తెలంగాణ, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ,మిజోరాం)అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను భారత ఎన్నికల కమిషన్..ప్రకటించనుంది. సీఈసీ రాజీవ్ కుమార్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడిస్తారు. ఈ సంవత్సరం తెలంగాణ (Telangana) , రాజస్తాన్ (Rajasthan), మిజోరం (Mizoram), మధ్యప్రదేశ్ (Madhya Pradesh), చత్తీస్ గఢ్ (Chhattisgarh) లో ఎన్నికలు జరగాల్సింది. కాగా ఈ ఐదురాష్ట్రాల్లో నవంబర్ నుంచి డిసెంబర్ మొదటివారంలోగా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఈసీ వర్గాలు గతంలోనే తెలిపాయి. తెలంగాణ, రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్ లో ఒకే విడతలో ఎన్నికలుజరిగే ఛాన్స్ ఉంది. చత్తీస్ గఢ్ లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. మిజోరం అసెంబ్లీ గడువు డిసెంబర్ 17వ తేదీతో ముగియనుండటంతో తెలంగాణ, రాజస్థాన్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ గడువు 2024 జనవరిలో వేరు వేరు తేదీల్లో ముగుస్తాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ పథకాలు, ఇతర కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఉండదు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చి ముగిసేంత వరకు ప్రభుత్వం ఎలాంటి హామీలు కానీ, పథకాలను కానీ ప్రవేశపెట్టేందుకు వీలుండదు. #telangana-assembly-elections-schedule-2023 #telangana-elections-2023 #telangana-assembly-elections-2023 #ts-elections-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి